ప్రజలే మా ఆత్మీయులు.. వారి సంక్షేమమే ధ్యేయం

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రతి గుంటకూ సాగు నీరందించడం, పండించిన ధాన్యం కొనుగోలు చెయ్యడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ మండలం బైరాపూర్, బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయిపేటలో జరిగిన రైతు దినోత్సవంలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు స్పీకర్ పోచారం చేరుకున్నారు. బీర్కూర్ మండలంలోని బైరాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదొక పండుగ రైతు లేకపోతే రాజ్యం లేదని, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే రైతు పండుగ అన్నారు. రైతులకు కులం, మతం, ప్రాంతం అనేది ఉండదని, రైతులు అమాయకులు, కష్టపడి పనిచేయడం తప్ప మోసం తెలియదన్నారు. 1969 లో జరిగిన తొలి దశ పోరాటంలో నేను పాల్గొన్నానాని ఇందిరాగాంధీకి లొంగిపోయి మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని నీరుగార్చారని తెలిపారు. 2001 లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ విజయం సాధించేవరకు అగలేదన్నారు. అమరుల త్యాగాల ఫలితం, తెలంగాణ ప్రజల పోరాటం, కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. 9 ఎండ్లల్లో సాధించిన అభివృద్ధి
2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు అవసరమైన వాటిని సమకూర్చారు. 2014 లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,000 మెగావాట్లు అయితే నేడు 18,000 మెగావాట్ల కు పెరిగిందన్నారు. దేశంలో 24 గంటల నాణ్యమైన కరంటును వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. ఎరువులు, విత్తనాలను కొనుక్కోవడానికి రైతుబంధు ద్వారా ప్రతి సీజన్ కు ఎకరాకు అయిదువేల రూపాయలు ఇస్తున్నారు. పండిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా అయిదు లక్షల రూపాయలు రైతుబీమా నగధు అందుతుందన్నారు. దేశంలో ఈ సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 2014 లో 1.08 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే నేడు 2.18 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు.
2014 లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వరి ధాన్యం ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నులు. 2021-22 లో 1.30 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల రైతుబంధు నిధులు వచ్చాయి. 1500 మంది రైతులు చనిపోతే 75 కోట్లు రైతుబీమా డబ్బులు అందయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 2014 కు ముందు వానాకాలంలో సాగు 70,000 ఎకరాలు అయితే నేడు 1.10 లక్షల ఎకరాలకు, యాసంగిలో 50,000ఎకరాల నుండి 1.10 లక్షల ఎకరాలకు పెరిగింది. సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోని ఆదర్శంగా నిల్చామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జితేష్ వి పాటిల్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్ మాజీ జెడ్పిటిసి సతీష్, జెడ్పిటిసి స్వరూప శ్రీనివాస్, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love