శ్వేతపత్రం తప్పులతడక : బీఆర్ఎస్

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పులతడకగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనిపిస్తోందన్నారు. శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా.. రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందన్నారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. కావాలంటే వారి పేర్లు బయటపెడతానని సవాల్ చేశారు.
అప్పు, GSDP, నిష్పత్తిని చూపకుండా అప్పు రెవెన్యూ రాబడని చూపించారని అన్నారు. GSDPలో రుణం తక్కువగా తీసుకున్నామని వెల్లడించారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీశ్‌రావు అన్నారు.

Spread the love