మణిపూర్ మహిళలకు రక్షణ కల్పించి దుండగులను వెంటనే శిక్షించాలి

– దుండగుల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ, జిఎస్ఎస్సి

నవతెలంగాణ- కంటేశ్వర్
మణిపూర్ మహిళలకు రక్షణ కల్పించి దుండగులను వెంటనే శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిఎస్ ఎస్సి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా గర్ల్స్ కన్వినింగ్ కమిటీ ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనలోనీ దుండగులను కఠినంగా శిక్షించాలని జిఎస్ఎస్సి కో-కన్వీనర్ దీపిక డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించడం దేశానికే అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా కాకపోవడం దారుణమని అన్నారు. మాన్ కి బాత్ లో గళం విప్పే ప్రధానమంత్రి మోడీ మణిపూర్ ఘటనలో పెదవి విప్పకపోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనతో యావత్తు దేశం భయఆందోళనలతో ఉన్నారని అన్నారు. కేంద్రం బేటి బచావో బేటి పడావో నినాదాన్ని తుంగలో తొక్కిందని వాపోయారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటివరకు మాట్లాడకపోవడం అంతర్యం ఏమిటో అని వాపోయారు. సేవ్ మణిపూర్ – సేవ్ గర్ల్స్ అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు.అదే కేంద్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ అంశంలో తీవ్ర వైఫల్యం చెల్లిందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని లేకపోతే భవిష్యత్తులో గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలిసి గర్ల్స్ కన్వేనింగ్ కమిటీ సభ్యులు నీలిమ, మేఘన, సాధియ, షరీన్, లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విగ్నేష్, అనిల్, నగర కార్యదర్శి మహేష్, సురేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love