8 నెలల జీతాలను చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలి..

– బోర్గాం గ్రామ పరిశుద్ధ కార్మికుల ఆవేద..

నవతెలంగాణ – రెంజల్
గత ఎనిమిది నెలల నుంచి తాము వెట్టి చాకిరి చేసిన జీతాలు చెల్లించడం లేదని గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మి కులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో డబ్బులు లేకపోవడం వల్లే తాము సకాలంలో జీతాలు చెల్లించడం లేదని గ్రామ కార్యదర్శి పేర్కొంటున్నారని వారన్నారు. నెల జీతం రాకపోతేనే ప్రభుత్వ ఉద్యోగులు నాన్న ఐరాన పడుతూన్న ఈ రోజులలో తమకు గత ఎనిమిది నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయి కార్మికురాలు గంగమని తన ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలకు మూడు పూటలా అన్నం పెట్టే పరిస్థితులు లేవనరు. మరో వారం పది రోజులు చూసిన తర్వాత తాము పందాలు నిలిపివేసి కూలీ పనులకు వెళ్తామని వారు హెచ్చరిచారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు గంగాధర్, పోశెట్టి గంగమణి తదితరులు.
Spread the love