8 రోజుల్లోనే మూడోసారి భూకంపం

ఫయాజాబాద్‌ : ఆప్ఘనిస్తాన్‌లో వారం రోజుల వ్యవధిలో మూడోసారి భూకంపం సంభవించింది. తాజాగా గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఫైజాబాద్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత 4.7గా నమోదైనట్టు నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఫైజాబాద్‌కు తూర్పు ఈశాన్యంగా 285 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్‌ ట్వీట్‌ చేసింది. ఈ భూకంపం 73.47 పొడవు, 38.22 వెడల్పు, 107 కిమీ లోతులో సంభవించిందని ఎస్‌సిఎస్‌ తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో మార్చి నెల మొదటివారంలోనే వరుసగా మూడోసారి భూకంపం సంభవించింది. గత బుధవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో కూడా 4.2 తీవ్రతతోనూ, మళ్లీ మార్చి 2న 4.1 తీవ్రతతోనూ ఇదే ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Spread the love