టోక్యో: తీవ్ర భూకంపం కారణంగా ధ్వంసమైన ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుండి కలుషితమైన అణు ధార్మిక జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయవద్దం టూ జపాన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ వ్యర్ధ జలాలను సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ ప్రభుత్వం యోచి స్తోంది. కాగా స్థానికులు మాత్రం ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నారు. జపాన్‌లో అతిపెద్ద భూకంపం వచ్చి శనివారం నాటికి 12 ఏళ్ళు గడిచాయి. ఈ నేపథ్యంలో సముద్రాన్ని డస్ట్ బిన్‌గా మార్చవద్దంటూ నినాదాలు ఊపందుకుంటు న్నాయి. టోక్యో టెప్కో ప్రధానకార్యాలయం ఎదురుగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి తమ వ్యతిరేకత తెలియచేశారు. అణు ధార్మికత కలిగిన జలాలను సముద్రంలోకి విడిచిపెట్టడం పెద్ద నేరమని అన్నారు.