నవతెలంగాణ – డిచ్ పల్లి
మహిళా శక్తి ఈ దేశానికి అవసరమని, అందుకుమహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు అన్నారు. గురువారం
తెలంగాణ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ కబడ్డీ ఉమెన్స్ టోర్నమెంట్ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ యూనివర్సిటీ లో విద్యతోపాటు ఆటలకు సమ ప్రాధాన్యతను ఇస్తానని తెలిపారు. కళాశాల నుండే క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచి అనేక పథకాలు సొంతం చేసుకుంటారని తెలిపారు. ప్రధానంగా మహిళా శక్తి ఈ దేశానికి అవసరమని అందుకు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో శ్రద్ధ పెట్టి, మంచి ప్రతిభను ప్రదర్శించాలని తెలిపారు. భవిష్యత్తులో మంచి నైపుణ్యం కలిగిన కోచ్ లను నియామకం చేస్తానని తెలిపారు.విద్యతోపాటు విద్యార్థులు క్రీడలలో పాల్గొన్నట్లయితే వారికి శారీరక మరియు మానసిక వికాసం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రధానంగా మహిళలు చదువు తో పాటుగా క్రీడల్లో కూడా ముందుండాలన్నారు.ఈ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశమని, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ టోర్నమెంట్ లో విన్నర్‌గా గిరిరాజ్ కళాశాల గెలుపొందింది, రన్నర్ గా యూనివర్సిటీ కళాశాల నిలిచింది.విజేతలకు సర్టిఫికేట్స్,మెడల్స్ టీం ట్రోఫీ లను డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్ అందచేశారు.ఈ టోర్నమెంట్ నిర్వహణలో యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత, వివిధ కళాశాల ఫిజీకల్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.