ఇదేనా.. ఆరోగ్య తెలంగాణ

– కనీస వైద్య ఆరోగ్య సేవలకు నోచుకోని భీమారం
– కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిల్ల రాధిక
నవతెలంగాణ- భీమారం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధునాతన వైద్య సేవలు అందుతాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తెలంగాణ రాష్ట్రం ఇదేనా అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిల్ల రాధిక ప్రశ్నించారు. మండల కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలను లేవనెత్తుతూ వివిధ ప్రాంతాల్లో ఆమె బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భీమారం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం కనీస సేవలతో కూడిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయకపోవడం బాధాకరం అన్నారు. గత కొంత కాలం క్రితం కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని దుర్గం భారతి (16) పాముకాటుతో మృత్యువాత పడిందని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇందుకు స్థానికంగా వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో ఈ ఒక్క సంఘటనను గుర్తు చేసుకుంటే అర్థమవుతుందన్నారు. ఇది ఇలా ఉన్నప్పటికీ కనీసం మండల కేంద్రంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం తో సరైన సమయానికి వైద్యం అందక అమ్మాయి మృతి చెందింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిసరాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసైనా ప్రభుత్వం కనీసం కనికరించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. లేకపోతే భీమారం మండలమే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. భీమారం మండల కేంద్రంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మంజూరు చేశామని చెప్తున్నప్పటికీ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నిస్తే వైద్య ఆరోగ్యశాఖ స్పందించడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ అవి అమలు చేయడంలో ప్రజలను మోసం చేయడం తగదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు చెప్పాలన్నారు. ఇకనైనా ప్రజలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే మండలానికి కేటాయించిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల మహిళలు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు చెప్పాలన్నారు. ఇకనైనా ప్రజలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే మండలానికి కేటాయించిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల మహిళలు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love