కుల వృత్తిదారులకు వెన్ను దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం

నవతెలంగాణ -గంగాధర: కుల వృత్తిదారులకు వెన్ను దన్నుగా నిలుస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి  నియోజక వర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన బీసీ బంధు లబ్దిదారులకు  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ కుల వృత్తులు అంతరించి పోకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తుందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని అన్నారు. దళితులకు దళిత బందు, బీసీలకు బీసీ బంధును అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషీ చేస్తున్నారని అన్నారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజక ,నాయి బ్రాహ్మణ , విశ్వ బ్రాహ్మణ కుల వృత్తదారుల ఎదుగుదలకు  బీసీ బంధు ద్వారా అందించే 1 లక్ష రూపాయలు తోడ్పపడతాయని అన్నారు. గత పాలకుల చేతిలో కుల వృత్తులు మట్టిలో కలిసిపోయాయని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుల వృత్తులు అభివృద్ధి చెందడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు, రైతు భీమా, ప్రతి ఎకరాకు నీరు అందించటం వల్ల భూమి విలువలు పెరిగాయని అన్నారు. రైతును రాజును చేస్తున్న రైతు బంధావుడు కెసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో కొడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత సర్పంచులు నవీన్ రావు సాగర్ మడ్లపల్లి గంగాధర్ తో పాటు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ శ్రేణులు బిసి బందుల లబ్దిదారులు పాల్గొన్నారు.
Spread the love