వాలీబాల్ పోటీలకు ఎంపికైన తొర్లికొండ విద్యార్థి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఈనెల 11న కామారెడ్డి జిల్లా జడ్పీహెచ్ఎస్ పేట సంఘంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 14 వాలీబాల్ ఎంపిక పోటీలలో జక్రాన్ పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థి బి రాజు నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుండి 18 వరకు మెదక్ జిల్లా చేగుంట మాడల్ స్కూల్లో జరిగే 68వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోటీలకు ఎంపికైన బి రాజును పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ అభినందించారు. అలాగే క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల నుండి వాలీబాల్ క్రీడలో రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా జట్టును రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసి జాతీయ పోటీలకు ఎంపిక కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు,రామకృష్ణ, సునీత,కృష్ణ, మాలతి, గౌతమి, పల్లె గంగాధర్ మరియు ఓఎస్ శేఖర్ లు పాల్గొన్నారు.

Spread the love