ఇంట్లోనే థ్రెడింగ్‌…

కనుబొమ్మలు చక్కగా తీర్చిదిద్దినట్లు ఉండాలంటే థ్రెడింగ్‌ తప్పనిసరి చేయించుకోవాలి. ఒకోసారి బయట పార్లర్‌కు వెళ్ళి వెయిట్‌ చేసి చేయించుకునే సమయం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఇంట్లోనే థ్రెడింగ్‌ చేసుకోవచ్చు. కాకుంటే కొంచెం ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం…
న థ్రెడింగ్‌కు మంచి హై-కాటన్‌ థ్రెడ్‌ అవసరం. సింథెటిక్‌ థ్రెడ్‌ కంటే కాటన్‌ థ్రెడ్‌తోనే గ్రిప్‌ గట్టిగా ఉంటుంది. థ్రెడింగ్‌ యేసుకునేపుడు దారాన్ని 14 ఇంచులు ఉండేలా చూసుకోవాలి.
చిన్న ఐబ్రో కత్తెర అవసరం. కత్తెర చిన్నగా, షార్ప్‌గా ఉండాలి. థ్రెడింగ్‌కి ముందు ఐబ్రోస్‌ని ట్రిం చెయాల్సి ఉంటుంది. శుభ్రమైన ఐబ్రో బ్రష్‌ ఉండాలి.
ఐబ్రో పెన్సిల్‌ కూడా అందుబాటులో ఉండాలి. కావాల్సిన షేప్‌ డ్రా చేసుకునేందుకు పనికొస్తుంది. ఈ పెన్సిల్‌ ఐబ్రోస్‌ కంటే డార్కర్‌ షేడ్‌లో ఉన్నది ఎంచుకోవాలి. ఈ పెన్సిల్‌ మార్క్‌ మేకప్‌ రిమూవర్‌తో లేదా నీటితో కానీ పోయేలా ఉండాలి. అలాగే అలోవెరా జెల్‌ గానీ, ఐస్‌ క్యూబ్స్‌ కానీ దగ్గర పెట్టుకోండి. థ్రెడింగ్‌ అయిన తర్వాత ఇవి అప్లై చేస్తే హాయిగా ఉంటుంది. లేదంటే మంటగా ఉంటుంది.

Spread the love