ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడికి బెదిరింపు ఫోన్ కాల్

Threatening phone call to national president of Praja Ekta Party– కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండి
– పోలీసులకు బోనాల శ్రీనివాస్ విజ్ఞప్తి
– నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
గౌలి గూడ చమన్ ప్రాంతానికి చెందిన ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు.   పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని అగంతకుడు -923324487436 ఫోన్ నెంబర్ నుండి వాట్సాప్ ఫోన్ కా ల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. గుర్తుతెలియని అగంత కుడు హిందీలో మాట్లాడుతూ బోనాల శ్రీనివాస్ మాట్లాడుతున్నారా? అని అడిగాడని, అయితే తన పిల్లలు పేర్లు చెబుతూ…మీ పిల్లలు ఎక్కడు వారో నీకు తెలుసా ? అని అడదంతో తన ముందే కుమారుడు, కూతురు ఉండటంతో మా పిల్లలు ఎక్కడుండాలి అని నేను అతన్ని అడగ దంతో… నీవు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి 7 నేను ఇంటెలిజెన్స్ అధికారిని మాట్లాడుతున్నా. నీ సంగతి తేలుస్తా… అంతు చూస్తా. నన్నే ప్రశ్నిస్తావా? నన్ను ఏమునుకుంటున్నావు అంటూ బెదిరించడంతో కాల్ను కట్ చేసినట్లు తెలిపారు. తిరిగి అదే నెంబర్ ద్వారా నుండి తన ఫోను మిస్ కాల్ వచ్చినట్లు వివరించారు. దీంతో తాను అఫ్టల్గాంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు వాట్సాప్ నెంబర్ ద్వారా బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులకు తెలియజేయగా, బెదిరింపు కాల్ వచ్చిన నెంబ రను పరిశీలించిన అఫ్టలంజ్ దీర్ఘ ఇది పాకిస్తాన్ దేశానికి సంబంధిం చిన ఫోన్ నెంబర్ అని, దాంతో ఏమీ కాదన్నారని తెలిపారు. కేసు నమోదు చేసి బెదిరింపు కాల్ గురించి దర్యాప్తు చేయకుండా ఆ నెంబ రాన్ను డిలీట్ చే యండి అని ఉచిత సలహా ఇచ్చారని బోనాల శ్రీనివాస్, పేర్కొన్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి పాకిస్తాన్ వాడైతే, తన పేరుతో పాటు తన పిల్లల పేర్లు ఫోన్లో ఎలా చెప్పాడని, ప్రశ్నించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉందన్న సందేహం కలుగుతుందని, పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేసి, బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి, చట్టరీత్యా శిక్షిండా లని కోరారు. ఈ విషయమై నగర పోలీస్ కమీషనర్  ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
Spread the love