– ఎమ్మెల్సీ కోదండరామ్
– ఘనంగా జనసమితి ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ – ముషీరాబాద్
తెలంగాణ జనసమితి ఎనిమిదేండ్లుగా జనం పక్షాన నిలబడి నిలదొక్కుకున్నదని, ప్రజా సమస్యలే వేదికగా ఉద్యమిస్తున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్‌నగర్ గుండు, రాంనగర్ మీసేవ ప్రాంతాల్లో బుధవారం ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణలు చేసి ప్రసంగించారు. డబ్బు కేంద్రంగా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పక్షాన, ప్రజాసమస్యలపై నిత్యం గొంతెత్తుతూ నిలబడిన పార్టీ తెలంగాణ జనసమితి అని చెప్పారు. ఆదివాసీలు, రైతుల పక్షాన, నిరుద్యోగులకు అండగా, కార్మికులకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. నగర కమిటీ ఉపాధ్యక్షులు పునిరెడ్డి జైపాల్‌రెడ్డి, అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షు కాకునూరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.నరసయ్య, ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, ముషీరాబాద్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు జస్వంత్ కుమార్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షులు జి.రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రజాసమస్యలే వేదికగా టీజేఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



