నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 235 గురుకుల విద్యా సంస్థల నుంచి మొత్తం విద్యార్థులు 16,845 అందులో బాలురు 6,211, బాలికలు 10,634 ఉన్నారు. అందులో 16,693 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 6,127 మంది ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 10,566 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 99.1 కాగా అందులో బాలుర ఉత్తీర్ణత శాతం 98.65, బాలికల ఉత్తీర్ణత శాతం 99.36గా ఉంది.
విద్యారంగంలో విశిష్ట ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఈ ఫలితాలు సంస్థ క్రమశిక్షణ, నిబద్ధత, సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచాయి. విద్యార్థుల అహర్నిశల శ్రమ, తల్లిదండ్రుల అండదండలు, ఉపాధ్యాయుల నిబద్ధత ప్రిన్సిపాల్ ల పర్యవేక్షణ, జోనల్ అధికారుల సమన్వయం ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం అన్ని కలిసి ఈ విజయాన్ని సాధ్యం చేశాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్థ సాధించిన విశిష్ట ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అద్భుత ఫలితాలు ఇతర విద్యాసంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా విద్యార్థుల ప్రతిభను అభినందించి, ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు ఇది స్పష్టమైన ఫలితం అని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఫలితాలు గురుకులాల్లో ఒక చరిత్రను సృష్టించిందని అభివర్ణించారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయులు అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ధృఢó సంకల్పంతో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు, సదుపాయాలకు ఈ ఫలితాలకు పునాది అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ విజయేంద్ర బోయి విద్యార్థులకు, అధికారులకు, టీచింగ్ స్టాఫ్‌కు, గురుకుల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సంస్థ పరిపాలన నాణ్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు
ఇస్లావత్ తిరుపతి 590/600
యు.అలేఖ్య 585/600
కొత్తూరు స్వేచ్ఛ దాస్ 584/600
ఎం.శృతి 584/600
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థుల సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



