– ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు
– విప్‌లు జారీ చేసిన పార్టీలు, అనారోగ్యంతో ఉన్న ఎంపిలకు అంబులెన్స్‌లు
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు పోరాటానికి సిద్ధమయ్యాయి. తమ ఎంపిలకు విప్‌లు జారీ చేశాయి. తమ సభ్యుల 100 శాతం హజరు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అనారోగ్యంతో ఉన్న ఎంపిల కోసం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో సభకు వచ్చే అవకాశం ఉందని, అస్వస్థతకు గురైనా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కూడా సభకు వచ్చే అవకాశముందని సమాచారం. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న మరో ఎంపి బశిష్ట నారాయణ సింగ్ (75 ఏళ్లు, జెడి(యు)) కూడా అంబులెన్స్‌లో పార్లమెంట్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు మద్దతిస్తామని వైసిపి ఇప్పటికే ప్రకటించగా, దీనిని వ్యతిరేకిస్తామని బిఆర్‌ఎస్ తెలిపింది.
వచ్చే వారంలో పార్లమెంట్‌కు
1:05 am