నేడు పంజాబ్ vs రాజస్తాన్ రాయల్స్ కీలక మ్యాచ్.. గెలిచే జట్టేది..?

నవతెలంగాణ, వెబ్ డెస్క్‌ : ఐపీఎల్ – 2024 లీగ్ లో భాగంగా ఈరోజు కీలక మ్యాచ్ జరగబోతోంది.  ఇప్పటివరకు ఈ లీగ్ లో 26 మ్యాచ్ లు పూర్తయ్యాయి. 27వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ .. రాజస్తాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఛండీఘర్ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7.30  నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఒకసారి ఈ టీమ్ ల గురించి తెలుసుకుందాం..!

రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ సెకండ్ ఫేవరేట్ టీమ్ గా పేరున్న టీం రాజస్థాన్ రాయల్స్ .. ఈ ఐపీఎల్ ను ఈ టీం చాలా ఘనంగా ప్రారంభించింది. ఐదు మ్యాచ్ లు ఆడి, వరసుగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, ఒక్క మ్యాచ్ లో ఓడి, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే, ఈ లీగ్ ను ఎలా ప్రారంభించిందో మనకు అర్థమవుతుంది.
ఆర్ ఆర్ ప్లేయర్ల విషయానికొస్తే: ఈ ఐపీఎల్ లో వీరి ఓపెనర్స్ ( బట్లర్, యశస్వీ జైశ్వాల్,) పెద్దగా రాణించలేకపోయారు. బట్లర్ ఆర్ సీబీ పై సెంచరీ తప్పా, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంకో ఓపెనర్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. కానీ వీరి మిడిలార్డర్ బ్యాటర్స్, (సంజూ శాంసన్, రీయాన్ పరాగ్, హెట్మేయర్, అశ్విన్) బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ మాత్రం టీం అగ్ర స్థానంలో ఉండడంలో కీలకపాత్ర  పోషించారు. రియన్ పరాగ్  ఈ ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ లిస్టులో  సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. వీరితో పాటు హెట్మేయర్ మెరుపు షాట్లతో అలరిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. చాహల్, న్యూజిలాండ్ స్పీడ్ గన్ ట్రెండ్ బౌల్ట్, అశ్విన్, వికేట్లు తీయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అటు బ్యాటుతో, ఇటు బాల్ తో సమిష్టి కృషి చేస్తూ, టీం ను అగ్ర స్థానంలో కొనసాగడానికి దోహదపడుతున్నారు.

పంజాబ్ కింగ్స్
పంజాబ్ గత పదేండ్లలో ఒక్కసారికూడా ప్లేఆఫ్స్ కు చేరలేదు. ఈ ఐపీఎల్ లో అయినా వారి రాత మారుతుంది అనుకుంటే, అంతంత మాత్రమే ఈ టీం ఈ లీగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జట్టు ఐదు మ్యాచ్ లు ఆడి, మూడు మ్యాచ్ లో  ఒడి, రెండింట్లో గెలిచింది అంటే ఈ టీం ఎలా ప్రదర్శన చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు.
వీరి ప్లేయర్ల విషయానిక వస్తే: వీరి ఓపెనర్స్ లో శిఖర్ ధావన్ తప్పా, జానీ బెయిన్ స్టో , ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. జానీ కూడా తిరిగి ఫాంలోకి వస్తే, ఈ టీం సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరి మిడిలార్డర్(శాంకరన్, శశాంక్ సీంగ్, రజా, అశుతోష్ శర్మ,) బలంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా శశాంక్, అశుతోష్ శర్మ చాలా బాగా రాణిస్తున్నారు. ఒటమి అంచుల నుండి ఎలా గెలవాలో గుజరాత్ పై వీరు ఆడిన ఆట తీరు చూస్తే మనకు అర్థం అవుతుంది. వీళ్ళ బౌలర్లు  రబాడ, హర్షదీప్ సీంగ్ తప్పా, మిగతా బౌలర్లు (హర్షల్ పటేల్, దీపక్ చాహర్, హర్ ప్రీత్ బార్,) వికేట్లు తీయలేకపోతున్నారు. మరి ఈ రోజు అగ్ర స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. రాయల్స్ ను ఓడించి, పాయింట్ల పట్టికలో ముందుకుపోతుందో, లేక అదే స్థానంలో కొనసాగుతుందో చూడాలి.
తుది జట్ల అంచనా..!
రాజస్థాన్ రాయల్స్:  జోష్ బట్లర్, యశశ్వీ జైశ్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికేట్ కీపర్) రియాన్ పరాగ్, ధృవ్ జురేల్, శింరాన్ హెట్మేయర్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, చాహల్, (కుల్దీప్ సేన్,)
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, జానీ బెయిన్ స్టో, ప్రభు శిమ్రాన్ సింగ్, శ్యాం కరన్,  జితేష్ శర్మ, శశాంక్ సింగ్, సింకిందర్ రజా, అశుతోష్ శర్మ, హర్ ప్రీత్ బార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ,(హర్షదీప్ సింగ్)

                                                                                                                                                                             – న‌వ‌తెలంగాణ వెబ్

Spread the love