నాటి అమరుల త్యాగఫలితమే నేటి తెలంగాణ: మంత్రి జగదీశ్‌రెడ్డి

నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
నాటి అమరుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దోసపహడ్‌ గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర సాధనలో అమరుడైన గ్రామానికి చెందిన కొండేటి వేణుగోపాలరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా చావుతోనైనా రాష్ట్ర రావాలని, సోనియా కళ్ళు తెరవాలని లేఖ రాసి మరణించిన వేణుగోపాలరెడ్డిని స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. సీఎం కేసిఆర్‌ నేతత్వంలో ఆనాటి రాష్ట్ర విభజన లక్ష్యాలు, కలలను సాకారం చేసుకుంటున్నామని, అదే అమరుల మరణానికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దొంగరి సుధాకర్‌, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, పిఎసిఎస్‌ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, సర్పంచ్‌ చెన్ను శ్రీనివాసరెడ్డి, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌, మామిడి అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్త, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఉద్యమకారులను ఎన్నడూ మర్చిపోదు
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌
కోదాడరూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను ఎన్నడూ మర్చిపోదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని పబ్లిక్‌ క్లబ్‌ నందు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం 200 మంది తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దశాబ్ది వేడుకల్లో అమరవీరులను స్మరించుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సీతారాంరెడ్డి, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, విశ్వేశ్వరరావు, కడారి వెంకటయ్య, కస్తూరి నర్సయ్య, సట్టు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, డాక్టర్‌ దశరథ, కందుల మధు, శాంత, చుండూరు ఉపేంద్ర, మైనంపాటి ప్రభాకర్‌రెడ్డి, ఎలక కవిత, పిట్టల భాగ్యమ్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ వెంపటి పద్మ మధుసూదన్‌, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, నాయకులు బుర్ర పుల్లారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, కందుల చంద్రశేఖర్‌, కోట మధు, షఫీ, మేదర లలిత, పాప్సం సభ్యులు డాక్టర్‌ బ్రహ్మం, నాయకులు దేవమణి, గంధం పాండు, సంపేట ఉపేందర్‌, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్‌ కార్యాలయంలో…
అమరుల త్యాగాలు మరువలేనివి అని ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పరిషత్‌ అధ్యక్షురాలు చింతా కవితా రాదారెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ శ్రీ, ఎంపీవో తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌ ఏఈ రాము, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చింతలపాలెం : తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరవలేనివని ఎంపీపీ కే.వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం అమరుల సంస్మరణ సందర్భంగా అమరులకు 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివద్ది అధికారి జె. శ్రీనివాసరెడ్డి, ఉపాద్యక్షులు పి.శ్రీనివాసరావు, ఎంపిటిసిలు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నాగారం : తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని మండల ఎంపీపీ కురం మనీ వెంకన్న అన్నారు. గురువారం నాగారం మండల కేంద్రంలోని ప్రజాపరిషత్‌ అభివద్ధి కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్కరణ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ.శోభారాణి, ఎంపీఓ శ్రీనివాస్‌, ఈసీ ముక్కంట,ి పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సిహెచ్‌.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులను సంస్కరించుకుంటూ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శానంపూడి సైదిరెడ్డి ఆదేశం మేరకు నివాళులర్పించారు. అనంతరం టౌన్‌ హాల్లో జరిగిన కార్యక్రమాలు అమరవీరులు సోమగాని భరత్‌, నందిగామ అంజయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్‌నాథరెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ గెల్లి అర్చన రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, మాజీ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, డాక్టర్‌ కెఎల్‌ఎన్‌ రెడ్డి, అట్లూరి హరిబాబు, పిచ్చయ్య, సోమగాని ప్రదీప్‌ , కౌన్సిలర్లు కొమ్ము శ్రీను, దొంగరి మంగమ్మ, ములకలపల్లి రాం, గోపి, కుంట ఉపేంద్ర , వీర్లపాటి గాయత్రి భాస్కర్‌, దొంతిరెడ్డి నవీన్‌రెడ్డి, కోలపూడి దయాకర్‌, కందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్‌ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగున అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం రెండేళ్లలోని అక్కున చేర్చుకొని, అమరుల కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందన్నారు. అనంతరం ఎంపీడీవో భీమ్‌ సింగ్‌ నాయక్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తీర్మానం సభ్యులందరికీ వినిపించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్‌ గుడిపాటి సైదులు, వైస్‌ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ విజరు కుమార్‌, దశరథ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సురేష్‌ ,ఎంపీటీసీలు వీరసోములు,మంగతి,నరేష్‌, సజన, వివిధ శాఖల అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు తలపెట్టిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేరేడుచర్ల మున్సిపాల్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని చైర్మెన్‌ చందమల్ల జయ బాబు అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయం నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, తమ ప్రాణాలను అర్పించిన అమరుల కోసం మౌనం పాటించి, అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ చల్లా శ్రీలత రెడ్డీ, కమిషనర్‌ జి శ్రీనివాస్‌ రెడ్డి కౌన్సిలర్లు కొనతం వెంకటరెడ్డి రనపంగా నాగయ్య ఎస్కే షహనాజ్‌ ,ఎస్‌.కె బాషా అలక సరిత, తాలూరి సాయిరాం, కొదమగుండ్ల సరిత భానోత్‌ లలిత, నూకల సుగుణ, బచ్చలకూరి ప్రకాష్‌, బైరెడ్డి జితేందర్‌ రెడ్డి ,వేమూరి నాగమణి ,కుంకు సులోచన కార్యాల సిబ్బంది పాల్గొన్నారు.
ఫొటో పెట్టాలి..
చివ్వేంల :అమరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎంపీపీ ధరావత్‌ కుమారి బాబు నాయక్‌ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా చివ్వేంల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం లో అమరవీరుల చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరుల త్యాగాలకు మరువకూడదన్నారు.. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీవో గోపి,ఎంపీటీసీ సుశీల,బిఆర్‌ఎస్‌ నాయకులు బాబు నాయక్‌, గోవిందరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
తిరుమలగిరి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన గురువారం తెలంగాణ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా తిరుమలగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించిన తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్‌ పోతరాజు రజిని రాజశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ సంకేపల్లి రఘునందన్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ దండు శ్రీనివాస్‌, వార్డ్‌ కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి, పత్తేపురం సరిత, కుదురుపాక శ్రీలత, గిలకత్తుల ప్రియాలత ,ఏమోజు రవీందర్‌ మహమ్మద్‌ షకీల్‌,తిరుమలగిరి మున్సిపాలిటీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కందుకూరి బాబు , సందీప్‌ నేత, నాని, వీరేష్‌ మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love