రైతు విజయమే వైకే లాబొరేటరీస్ లక్ష్యం
ప్రగతి రిసార్ట్స్‌లో ఘనంగా వార్షిక సర్వసభ్య సమావేశం : వీణ వెంకటరమణ రాయుడు
నవతెలంగాణ-హైదరాబాద్
స్మార్ట్‌ఫార్మింగ్ దిశగా రైతు విజయమే వైకే లాబొరేటరీస్ లక్ష్యమని సంస్థ అధినేత, ఎండీ వీణ వెంకటరమణ రాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో ఏప్రిల్ 26న వైకే లాబొరేటరీస్ వార్షిక సర్వసభ్య సమావేశం రంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైకే లాబొరేటరీస్ అధినేత, వీణ వెంకట రమణ రాయుడు కంపెనీ ఇప్పటివరకు సాధించిన విజయాలను వివరించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణపై టీమ్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ వార్షిక సమావేశంలో ముఖ్యంగా (సాంటాల్), (హైపాస్), (వ్యూహం) అనే మూడు నూతన ఉత్పత్తులను ఘనంగా లాంచ్ చేశారు. ప్లాంట్ ప్రొడక్షన్, న్యూట్రీషన్, లెస్ కెమికల్స్ స్మార్ట్‌ఫార్మింగ్ అనే భావనతో రూపొందించిన ఈ ఉత్పత్తులు రైతులకు సమగ్ర పరిష్కారాన్ని అందిస్తాయని సంస్థ వెల్లడించింది. వైకే లాబొరేటరీస్ రైతులకు విత్తనం నాటే దశ నుంచి కోత దశ వరకు అండగా నిలుస్తూ, రైతుల శ్రమను తగ్గించే విధంగా, ఒకే స్ప్రే ద్వారా ఎక్కువ ప్రయోజనాలు అందించే దిశగా నిరంతరం కషి చేస్తోందని వీణ వెంకట రమణ రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ విజయాల పరంపరను మరింత బలోపేతం చేయాలని అన్ని జిల్లాలు మరియు రాష్ట్రాల ప్రతినిధులు ఆకాంక్షించారు. అలాగే సంస్థ పేరుకు అర్థం మరియు ఆ పేరుకి ఉన్న ప్రత్యేకతను కూడా వీణ వివరించారు.
సాంటాల్:సాంటాల్ ఒక యూనిక్ కాంబినేషన్ ప్రొడక్ట్, ఇది పోషణతో పాటు త్రిప్స్ అండ్ మైట్స్ వంటి సక్కింగ్ పెస్ట్స్‌పై సమర్థవంతంగా పని చేస్తుంది. రోజ్, క్రైసాం తిమమ్, మిర్చి, టమోటా వంటి పంటల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. స్ప్రే చేసిన తర్వాత ఆకులు, పూలపై స్టిక్కీ లేయర్ ఏర్పడి పురుగులు పట్టుకోవడం, కదలడం, ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. దీంతో పెస్ట్ జీవచక్రం తగ్గుతుంది.
హైపాస్:హైపాస్ ఒక నెక్స్ట్ జనరేషన్ లిక్విడ్ ఫాస్ఫరస్ ఆర్గానిక్ కార్బన్ ప్రొడక్ట్, ఇది పంటకు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. వరి, మొక్కజొన్న, మిర్చి, టమోటా, ద్రాక్ష వంటి అన్ని పంటలకు అనుకూలం. ఇది వేగంగా సెట్టింగ్ పెంచి, పండ్ల పొడవు మరియు పరిమాణం మెరుగుపరుస్తుంది. అలాగే పెద్ద, బలమైన పూలు ఏర్పడేందుకు సహాయపడుతుంది.
వ్యూహం:వ్యూహం ఒక స్మార్ట్ సాప్ సక్కర్ కంట్రోల్ టెక్నాలజీ ఇది పిండి నల్లి, తెల్ల దోమ, పచ్చ దోమ వంటి పెస్ట్స్‌పై ప్రభావవంతంగా పని చేస్తుంది. పత్తి, ద్రాక్ష, వరి మరియు కూరగాయల పంటలకు ఎంతో ఉపయోగకరం. స్ప్రే చేసిన తర్వాత ఆకులపై రక్షణ పొర ఏర్పడి పురుగులు సెటిల్ అవ్వకుండా చేస్తుంది. ఫీడింగ్ తగ్గించి పెస్ట్ జనాభాను నియంత్రిస్తుంది.
స్మార్ట్ ఫార్మింగ్ దిశగా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



