ఉపాధ్యాయులకు బోధనపై శిక్షణ

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసి (తొలిమెట్టు) లో భాగంగా ఎంపీపీఎస్, యుపిఎస్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు విద్యాబోధనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ఏ విధంగా బోధించాలని మెలకువలు, సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి వేణుగోపాల్ శర్మ నిజామాబాద్ జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ శ్రీపతి, కామారెడ్డి జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ శ్రీనాథ్, ఆర్పీలు గోపికృష్ణ, లక్ష్మీనారాయణ రావు, నవీన్, మండల ఉపాధ్యాయులు, ఎం ఐ ఎస్ పాపయ్య, సిఆర్పి ఈశ్వర్, మహేందర్, సత్యం, సి ఓ సంపత్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love