బదిలీలు సాగాలి.. బడులు నిండాలి..

Transfers should go on.. Schools should be full..”మేం ఎన్నికల విధుల్లో ఉన్నాం. మమ్మల్ని వేరే చోటికి బదిలీ చేయడం వల్ల సాధారణ ఎన్నికల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. కావున ఈ బది లీల ప్రక్రియను నిలుపుదల చేయాలి” అని కొంతమంది గెజిటెడ్‌ ప్రధానోపా ధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ”సీనియార్టీ జాబితాలో అనేక తప్పులు న్నాయి. ఈ జాబితాలతో పదోన్న తులు నిర్వహిస్తే మాకు అన్యాయం జరుగుతుం దని” రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు న్యాయస్థానంలో కేసు వేశారు. లోపా లను సవరించే వరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్ట రాదని వాదిస్తున్నారు. ఇవి అస్తిత్వ వాద పోకడలు. తమ స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయో జనాల కోసం వ్యవస్థకు మేలు చేసే ప్రక్రియలను సైతం ఆపేయాలని కోరడం అమానుషం, అహే తుకం. సంకుచితత్వ ధోరణులతో విద్యారంగానికి తీరని నష్టం చేకూర్చే ఇలాంటి కుట్రపూరిత చర్యలను ప్రతీ ఒక్కరు నిరసించాలి, అడ్డుకోవాలి. ఉపాధ్యా యుల బదిలీల వల్ల ఎన్నికల ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతాయనుకుంటే దానికి ప్రత్యామ్నాయ మార్గా లను అన్వేషించే బాధ్యత ఎన్నికల కమిషన్‌ ది. అవస రమైతే ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులం దరినీ యధావిధిగా పాతస్థానాల్లోనే కొనసాగించా లని ప్రభుత్వాన్ని కోరే అవకాశం, అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థల అధికారాలను, విధులను కూడా తామే నిర్వహిస్తున్నట్లు నటించడం సదరు ప్రధానో పాధ్యాయులకు మంచిది కాదు. అలాగే… సీనియా రిటీ జాబితాలో లోపాలుంటే ఫిర్యాదుల ద్వారా వాటి సవరణకు అప్పీల్‌ చేసే అవకాశం విద్యాశాఖ కల్పిం చింది. ఇది తెలిసీ, బదిలీల ప్రక్రియకు ఆటంకం కలి గించాలని కొంతమంది ఉపాధ్యాయులు ప్రయత్నిం చడం అవివేకం, అసాంఘీకం. రాజధాని నగరానికి సమీపంలోని మొదటి కేటగిరి పాఠశాలల్లో పని చేస్తున్న తాము బదిలీల వల్ల నగరానికి దూరం కావా ల్సివస్తుందనే అక్కసుతో ఈ ప్రక్రియకు ఆటంకపరిచే కుతంత్రాలివి. 23% హెచ్‌.ఆర్‌.ఎ కోల్పోవాల్సి వస్తుందనే నీచమైన చర్యలకు పాల్పడుతున్న వైన మిది. ఎంతో కాలంగా బదిలీలు, పదోన్నతులు లేక నైరాశ్యంలో ఉన్న మెజారిటీ ఉపాధ్యాయుల ప్రయోజ నాలకు అడ్డుకట్ట వేస్తున్న స్వార్థ చింతననివి.
పదోన్నతుల వల్ల ఉపాధ్యాయులకు ఆర్థికంగా ప్రయోజనం, హౌదా పరంగా ఉన్నతి చేకూరుతుం దనేది వాస్తవం. అయితే, దీనివల్ల ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతా తీరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యని విద్యావేత్తలు చెబు తున్నారు. ఖాళీ గా ఉన్న 13,086 ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. గత 5 ఏండ్లుగా విద్యా వాలంటీర్లను నియమించక పోవడం వల్ల సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతు న్నది. పదోన్నతుల వల్ల ఉన్నత పాఠశాల ల్లోని ఈ సమస్యకు పరిష్కారం లభి స్తుంది. ఇక బదిలీల్లో మెజారిటీ ఉపా ధ్యాయులు తాము కోరుకున్న స్థానాలను పొందుతారనేది కూడా నిజమే. అయితే.. పాఠశాల మార్పు వల్ల ఉపాధ్యాయుల్లో మానసిక ఉల్లాసం పెరిగి, బోధనా పరమైన ఆసక్తి, నైపుణ్యం మెరుగవుతాయి. అంటే.. బదిలీలు, పదో న్నతుల వల్ల అంతిమంగా విద్యార్థులకు, పాఠశాల లకు, సమాజానికి మేలు జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. అలాగే.. ఏర్పడిన ఖాళీల భర్తీ కోసం ఉపా ధ్యాయ నియామకాల ప్రక్రియ చేపట్టడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. గత 8 ఏండ్లుగా పదోన్నతులు లేవు, 5 ఏండ్లుగా బదిలీలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో పదోన్నతులు, 2018 లో బదిలీలు నిర్వ హించారు. కొన్నేళ్ళుగా ఉపాధ్యాయ సంఘాలు అనేక పోరా టాలు, ప్రాతినిధ్యాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి బదిలీలు, పదోన్నతులకు అంగీకరించింది, జీవో 5 ద్వారా మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుండి షెడ్యూల్‌ను ప్రారంభించింది. జీవో 9 ద్వారా 317 కేటాయింపుల్లో వివిధ జిల్లాలకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయుల మినిమం సర్వీసుతో సంబంధం లేకుండా పాత స్టేషన్‌ సర్వీసును పరిగణనలోకి తీసు కుని బదిలీల్లో అవకాశం కల్పించింది. అయితే, రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఫలితంగా 317 ఉపాధ్యాయుల ప్రయో జనార్థం వచ్చిన జీవో 9తో మిగిలిన బాధిత ఉపాధ్యా యుల్లో ఆశలు చిగురించాయి. కోర్టు సహకారంతో తమ డిమాండ్లు నెరవేర్చుకునే అవకాశాల కోసం దారులు వెతికేవారు పెరిగిపోయారు. సందట్లో సడే మియాలాగా బాధిత ఉపాధ్యాయులతో పాటు.. వ్యక్తి గత స్వార్థం కోసం కోర్టు మెట్లు ఎక్కేవారు బయలు దేరారు. తత్ఫలితంగా హైకోర్టులో కుప్పలుతెప్పలుగా కేసులు నమోదయ్యాయి. కేసుల వల్ల బదిలీల ప్రక్రి యలో వాయిదాల పర్వం కొనసాగింది. ఎట్టకేలకు ఆగస్టు 30న బదిలీల ప్రక్రియకు మార్గం సుగమం చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఉపా ధ్యాయుల్లో మళ్ళీ ఆశలు మొలకెత్తాయి. ప్రభుత్వం సెప్టెంబర్‌ 1 నుండి బదిలీల ప్రక్రియకు పున: శ్రీకారం చుట్టడంతో ఉపాధ్యాయుల్లో ఆనందాతి రేకాలు వెల్లివిరిసాయి.
ఉపాధ్యాయులు ఇలా తీవ్రమైన ఆందోళనా భావా నికి గురవ్వడానికి ప్రధాన కారణం 317జీవో అమలు చేసిన విధానం. జిల్లా, జోనల్‌ స్థాయి పోస్టు లను విభజించే క్రమంలో స్థానికతను పరిగణలోకి తీసు కోకుండా, కేవలం సీనియార్టీ ఆధారంగా చేసిన కేటా యింపుల వల్ల ఎంతోమంది ఉపాధ్యాయులు బల వంతంగా ఇతర జిల్లాలకు విసిరివేయబడ్డారు. మాన సికంగా ఒత్తిడిలోఉన్న ఈ ఉపాధ్యాయులు స్థానికత కోసం కోర్టులో కేసు వేసి, సొంత జిల్లాకు వెళ్లే అవకా శాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. 317 జీవో అమలు సందర్భంగా సీనియారిటీ జాబి తాల్లో లోపాలు, అధికారుల తప్పిదాలు, అక్రమదం దాల కారణంగా చాలామంది ఉపాధ్యాయులకు కేటా యింపుల్లో అన్యాయం జరిగింది. రకరకాల కారణా లతో వీరంతా కోర్టును ఆశ్రయించారు. అలాగే.. విభ జిత నూతన జిల్లాల్లో కూడా బదిలీల సీనియార్టీ రూప కల్పన, జిల్లాల్లో ఏర్పడిన పోస్టుల లోటు, ఇతర అనేక విషయాల్లో న్యాయస్థానంలో పదుల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. విద్యాశాఖను సంప్ర దించి, లోపాలను సవరించుకోగలిగిన విషయాల్లో కూడా ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయిం చడం శోచనీయం. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్న డూలేదు. సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ చొరవ చూపకపోవడం, భరోసానివ్వకపోవడం.. ఫిర్యాదులను కేవలం ఆన్లైన్‌ లోనే నమోదు చేయాలని పరిమితులు విధించడం, సీనియారిటీ జాబితాలు తప్పల తడకలుగా రూపొందించడం వంటి కారణాల వల్ల బాధితులు శాఖాపరంగా పిర్యాదు చేయడం మాని కోర్టు తలుపు తడుతున్నారు. తమకు న్యాయం చేయగలిగేది న్యాయస్థానం మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు. ఆఘమేఘాల మీద తీసుకొచ్చి, తమ జీవితాలతో చెలగాటమాడిన 317 జీవో అమలు తీరు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకొని ఉపాధ్యాయులు జడుసుకుంటున్నారు. చాలాకాలం తర్వాత వచ్చిన అవకాశం దూరమైతే, మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఈ ఛాన్స్‌ వదులుకోకూడదని నిర్ణయించుకుని న్యాయస్థానం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
న్యాయమైన తమ డిమాండ్ల కోసం కేసులు వేసే వారు ఒకవైపునుంటే, తమ స్వార్థం కోసం బదిలీల ప్రక్రియను అడ్డుకోవాలని చూసే కపట నాటక పాత్ర ధారులు మరోవైపునున్నారు. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి ప్రక్రియ వాయిదా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్టులో పిటిషన్లు వేసి పడిగాపులు గాస్తున్నారు. ఇది సరైంది కాదు. బదిలీలు, పదోన్నతు లను వ్యక్తుల ప్రయోజనాల దృష్ట్యా కాకుండా వ్యవస్థ కోణంలో చూడాలి. విద్యార్థుల భవిష్యత్తుకు ఇది బాట గా పరిగణించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనగా భావించాలి. ప్రభుత్వ పాఠశాలల మనుగడ కోసం తీసుకుంటున్న చర్యలుగా నమ్మాలి. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రుల స్థానం లో ఉండి ఆ దృష్టితో వీక్షించాలి. బదిలీలు, పదోన్న తుల ప్రక్రియ నిరాటంకంగా, సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఉపాధ్యాయుల న్యాయ మైన ఫిర్యాదులను, వాస్తవికమైన అభ్యంతరాలు పరి శీలించి, లోపాల సవరణకై ప్రభుత్వం పూనుకో వాలి, సరైన విధానాల అమలుతో ఉపాధ్యాయుల్లో నమ్మ కాన్ని ప్రోదిచేసుకోవాలి. నమోదైన కేసుల్లోని వాస్తవా లను, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వ్యవస్థ బాగు కోసం అవసరమైన తీర్పులు ఇచ్చేదిశగా న్యాయ స్థానం ఆలోచన చేయాలి. స్వార్థపూరితమైన ఆలోచన లతో న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించేం దుకు ప్రయత్నించిన వారిని తగిన విధంగా శిక్షిం చాలి. వ్యవస్థలో లోపాలను సవరించలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు వ్యక్తిగతంగా కొంత నష్టపోయినా ఉపాధ్యాయులు పాజిటివ్‌ దక్పథంతో ఆలోచించి బది లీల ప్రక్రియకు దన్నుగా నిలవాలి. పాఠశాలల మను గడ కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం సామా జిక దక్పథంతో ఆలోచించి ఈ ప్రక్రియను సజావుగా జరిగేందుకు సహకరించాలి. తద్వారా ‘బదిలీల ప్రక్రియ ముందుకు సాగాలి, ప్రభుత్వ బడులన్నీ ఉపాధ్యాయులతో నిండిపోవాలి’
వరగంటి అశోక్‌
9493001171

Spread the love