దేశం పేరు మారిస్తే బతుకులు మారుతాయా?

If the name of the country changes, will the lives change?ఆరెస్సెస్‌ 1925 సంవత్సరంలో పుట్టి రానున్న 2025కి వంద సంవత్సరాలు పూర్తి చేసు కుంటున్న సమయంలో ఈ దేశాన్ని ”హిందుత్వ రాష్ట్రంగా” మార్చే కుట్ర లో భాగమే ఈ పేరు మార్పు ఆలోచన దుశ్చర్య కావచ్చు! ఈ మధ్యకాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఒక సమావేశంలో ప్రజలను ఉద్దేశించి రెండు అంశాలను వెల్లడించారు. ఈ దేశ ప్రజలు ఇండియా అని పిలవకూడదు భారత్‌గా పిలవాలని మరి ఈ దేశంలోని భారతీయులందరూ హిందువులు అనే కొత్త నినాదాన్ని ఇవ్వడం అంటే ఈ దేశాన్ని మత కొట్లాటలతో విచ్ఛిన్నం చేయబోతుందనే అనుమానం రాకమానదు. దీన్నిబట్టి చూస్తే కేంద్రంలోని బీజేపీ ఆరెస్సెస్‌ కనుసైగల్లోనే నడుస్తుందని మరోసారి తేటతెల్లమైంది.
ఇండియాను విదేశీపేరుగా, భారత్‌ స్వదేశీ పేరుగా బీజేపీ కొత్త రాజకీయాలకు తెరదీసింది. 2023 జూలై 18న బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశం ఏర్పాటు చేసుకొని ”ఇండియా” (ఇండియా అనగా ది ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ కూటమిని) ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఈ దేశంలో జి20 శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబర్‌ 8 నుండి 10వ తేదీల్లో జరగబోయే సమావేశాల ముందు ”ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా” ను గెజిట్లో మార్పు చేసి లిప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌” గా విడుదల చేయడమంటే దేశ ప్రజలందరికీ ఆశ్చర్యం కలగచేసిన అంశంగా పరిగణించాలి. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఉత్తరప్రదేశ్‌ పాలిత యోగి ప్రభుత్వం మొదటగా అలహాబాద్‌ ప్రాంతం పేరును ప్రయాగ్రాజ్‌ గాను, ఫైజాబాద్‌నీ అయోధ్యగా నామకరణం చేసింది. బీజేపీ ప్రభుత్వానికి ప్రాంతాల పేర్లను రాష్ట్రాల పేర్లను దేశానికి సంబంధిం చిన పేర్లను మార్చడం ”వెన్నతో పెట్టిన విద్య’గా భావించాలి. ఎందుకంటే మోడీ స్వయానా తన గుజరాత్‌ రాష్ట్రంలో మోతేర క్రికెట్‌ స్టేడియానికి నరేంద్ర మోడీ స్టేడియంగా నామ కరణం చేయడం అంటే ”బతికున్న ప్పుడే తన సమాధికి తానే పేరు పెట్టు కున్నట్టుగా’ ఉందన్న మాట. రాజీy ్‌ఖేల్‌ రత్నను ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నగా మార్చడం ఓ జిత్తుల మారిగా మోడీ గారిని అభివర్ణించవచ్చు.
బ్రిటిష్‌ ప్రభుత్వం బెంగాల్‌ ప్రజలను ”విభజించు- పాలించు” అన్న చందంగా మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని విభజించడానికి పావులు కదుపుతోంది. భారత రాజ్యాంగం ప్రకరణ -1 ద్వారా ఈ దేశం రాష్ట్రాల కలయిక తో ఏర్పడింది అని అనగా ఈ దేశాన్ని ఎవరు విడగొట్టలేరని అర్థం. ఈ మౌలిక సూత్రాన్ని మోడీ ప్రభుత్వం మరవడం ఆందోళనకరం.1949 నవంబర్‌ 18న జరిగిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఈ దేశానికి అనేక పేర్లను సూచిం చారు. హిందుస్థాన్‌ అని ,భారతదేశం అని భారత్‌ వర్ష్‌గా ఇలా అనేక పేర్లను ప్రతిపాదించిన తర్వాత ప్లేబిసైట్‌ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ”ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌” ప్రకరణ -1 ద్వారా ప్రవేశికలో పొందుపరిచి రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం తెలిపింది. కానీ బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించడమే కాకుండా పాఠ్యాంశాల్లో డార్విన్‌ సిద్ధాంతాన్ని, భగత్‌సింగ్‌, అంబేద్కర్‌ పాఠాలను సైతం తొలగించడం చూసాం. మరి ఇతర మతాల మధ్య వైశ్యామ్యాలు పెంచుతూ ప్రజలను విభజించడమే పనిగా బీజేపీ కంకణం కట్టుకుందని తేటతెల్లమయింది. అయితే పేరు మార్చ డంతో ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా అంటే అదీ లేదు.2011 దేశ జనాభా లెక్కల ప్రకారం సుమారు ఒక లక్ష 21 వేల కోట్లు నిత్యం ఈ జనాభా పేదరికంతో, నిరుద్యోగితతో, ప్రాంతీయ అసమానతలతో బాధ పడుతున్న వీటిని పట్టించుకోకుండా దేశం పేరును మారిస్తే కీర్తి వస్తుందా అని అందరిలో రేకెత్తించే ప్రశ్న. దేశంలో మణిపూర్‌ రాష్ట్రంలో మరణహోమాలు, హత్యలు మానభంగాలు అనేక సంఘటనలు జరుగుతున్న వాటిపైన మన ప్రధాని పార్లమెంట్లో నోరు మెదపకపోవడం యావత్తు దేశం నిబ్బరపోయేటట్టుగా మోడీ పరిపాలన సాగుతుంది.
ఆరెస్సెస్‌ 1925 సంవత్సరంలో పుట్టి రానున్న 2025కి వంద సంవత్సరాలు పూర్తి చేసు కుంటున్న సమయంలో ఈ దేశాన్ని ”హిందుత్వ రాష్ట్రంగా” మార్చే కుట్ర లో భాగమే ఈ పేరు మార్పు ఆలోచన దుశ్చర్య కావచ్చు! ఈ మధ్యకాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఒక సమావేశంలో ప్రజలను ఉద్దేశించి రెండు అంశాలను వెల్లడించారు. ఈ దేశ ప్రజలు ఇండియా అని పిలవకూడదు భారత్‌గా పిలవాలని మరి ఈ దేశంలోని భారతీయులందరూ హిందువులు అనే కొత్త నినాదాన్ని ఇవ్వడం అంటే ఈ దేశాన్ని మత కొట్లాటలతో విచ్ఛిన్నం చేయబోతుందనే అనుమానం రాకమానదు. దీన్నిబట్టి చూస్తే కేంద్రంలోని బీజేపీ ఆరెస్సెస్‌ కనుసైగల్లోనే నడుస్తుందని మరోసారి తేటతెల్లమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కుహన మేధావులు ఈ భారత్‌ అని కాకుండా ”హిందుస్థాన్‌” అని నామకరణం చేయడానికి వచ్చిన అడ్డంకులను ప్రజలకు సూటిగా తెలియజేయాలి. వాటి ప్రశ్నలకు సమాధానాలు లేవని స్పష్టంగా ప్రజలకు అర్థమవు తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ ఈ దేశ ఐక్యత కోసం ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, మేధావులు, ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగి ఆర్‌ఎస్‌ఎస్‌ భ్రమను పటాపంచలు చేసి 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ముక్తకంఠంతో ముక్త్‌ బీజేపీ-విముక్త భారత్‌ అని నినదించాలి.
రాచకొండ విగేష్‌
6302246641 

Spread the love