Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేటు స్కూల్‌ బస్సులపై రవాణా శాఖ కొరడా

ప్రయివేటు స్కూల్‌ బస్సులపై రవాణా శాఖ కొరడా

- Advertisement -

విద్యాసంవత్సరం ప్రారంభంలో విస్ర్తతంగా తనిఖీలు..
245 కేసుల నమోదు 60 బస్సులు సీజ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రయివేటు పాఠశాల స్కూల్‌ ‌బస్సులపై రవాణా శాఖ కొరడా ఝలిపించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్ర్తతంగా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా దాదాపు 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేసింది. సోమవారం నుంచి పాఠశాలు పున:ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్తులను భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌ డ్రైవ్‌ ‌చేపట్టింది. ఫిట్‌నెస్ లేని వాహనాలు, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకొని నడుపుతున్న వాహనాలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్ లేని 60 బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్‌ ‌చేశారు. తనిఖీల్లో వాహనాల చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ను పరిశీలించారు. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉన్న బస్సులను ఆపేశారు. డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం తదితర అంశాలనూ చూశారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు ఉన్నాయా ? లేదా ? అనే విషయాలను తనిఖీ చేశారు. వాహనాల బ్రేకులు, టైర్లు, లైట్లు, ఇతర యాంత్రిక భాగాలను పరిశీలిం చారు. స్కూల్‌ ‌బస్సుల్లో అటెండర్ ఉన్నారా ? లేరా ? చూశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తం గా 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా 23,204 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని రవాణా శాఖ అధికారులు తెలియజేశారు. మిగతా 2783 బస్సులు సైతం ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -