రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలి

Transport sector workers need a welfare board– నూతన మోటార్‌ వాహన చట్టం -2019ను రద్దు చేయాలి : ఆల్‌ ఇండియా కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య
నవతెలంగాణ- యాదగిరి గుట్ట
రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయు) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని మున్నురుకాపు సంఘం భవనంలో రాష్ట్ర కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షత బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్‌.లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశ వ్యాపితంగా ఎనిమిది కోట్ల మంది రవాణా రంగంలో పనిచేస్తున్నారని, నిత్యం ప్రమాదాలకు గురవుతూ ఎంతో మంది చనిపోతున్నారని తెలిపారు. 2019లో లక్షా 54 వేలమంది, గంటకు 17 మంది కార్మికులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలిపారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన మోటార్‌ వాహన చట్టం -2019 కార్మికులకు తీవ్ర నష్టం చేసేవిధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించే వరకు కార్మికులు పెద్దఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీక ాంత్‌, రాష్ట్ర కోశాధికారి సతీష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు బాబు, రుద్ర కుమార్‌, కోటయ్య, రాంబాబు, రాష్ట్ర కార్యదర్శులు పున్నం రవి, రవికుమార్‌, విజేందర్‌, యాదాద్రి జిల్లా అధ్యక్షులు యండి పాషా, నాయకులు కుమాస్వామి, గోవర్ధన్‌, రాజమౌళి, నాగరాజు, శ్రీనివాస్‌, రాములు పాల్గొన్నారు.

Spread the love