రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు ట్రెసా అభినందనలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌, ఐజీ, సర్వే అండ్‌ సెటిల్మెంట్‌ కమిషనర్‌గా, భూ భారతి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా నవీన్‌మిట్టల్‌ అదనపు బాధ్యతలు చేపట్టడంపై ట్రెసా హర్షం వ్యక్తం చేసింది. రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ను సచివాలయంలో సోమవారం ట్రెసా ఆధ్వర్యంలో సన్మానించారు. ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్‌లతో కూడిన ప్రతినిధి బందం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ విభాగాలన్ని ఒకే దగ్గరికి రావడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రెవెన్యూలో మిగిలిపోయిన డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో పాటు కింది స్థాయిలో అన్ని కేడర్ల పదోన్నతులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వీఆర్వోలు, వీఆర్‌ఏల కారుణ్య నియామకాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మిట్టల్‌ సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్లి త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో అసోసియేట్‌ అధ్యక్షులు మన్నె ప్రభాకర్‌, రాష్ట్ర నాయకులు పి.రమేష్‌, నజీమ్‌ఖాన్‌, సైదులు, రమన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love