పీఎం జన్మన్ కార్యక్రమాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం ఎమ్మార్వో రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో శశికళ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ ఆవరణంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పీవీటీజీల అభివృద్ధి కోసం పీఎం జన్మన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పీఎం జన్మన్ కార్యక్రమంలో మండలంలోని పునకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పుట్టి గూడా విబి కాలనీలకు చెందిన గిరిజనులకు ఆధార్ కార్డు అప్డేషన్, కులం, నివాసం సర్టిఫికెట్ దరఖాస్తు, జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేశారు. కేంద్రం పీవీటీజీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని వినియోగించుకోవాలని తహసీల్దార్ రాజ మనోహర్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.గిరిజనులు పాల్గొన్నారు.