టీఎస్‌ పీఈసెట్‌ -2024 షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ పీఈసెట్‌ -2024 షెడ్యూల్‌ విడుదలనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీ.పీఇడీ, డీ.పీఇడీలో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీఎస్‌ పీఈసెట్‌ -2024 షెడ్యూల్‌ విడుదలైంది. సోమవారం హైదరా బాద్‌లో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో టీఎస్‌ పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కుమార్‌, మండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తదితర ఉన్నతాధికారులు షెడ్యూల్‌పై చర్చించారు. అనంతరం రాజేశ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 12న సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. మార్చి 14 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎలాంటి అపరాథ రుసుం లేకుండా మే 15 వరకు వాటి స్వీకరణకు గడువు. అపరాథ రుసుంతో మే 31 వరకు సమర్పించుకోవచ్చు. జూన్‌ 10 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు.

Spread the love