రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చెల్లించాలి..

– మహాజనసభలో రైతుల డిమాండ్.

నవతెలంగాణ – నిజాంసాగర్
రైతుల రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చెల్లించాలని సింగిల్ విండో మహాజనసభలో రైతులు కోరారు. ఆదివారం నిజాంసాగార్ మండలంలోని మల్లూరు ప్రాథమిక సహకార సంఘంలో మహాజనసభను సొసైటీ చైర్మన్ కళ్యాణి విట్టల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు సంఘంలో ఏడు కోట్ల లావాదేవీలు జరిగాయని ఆమె తెలిపారు.రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహాజనసభలో రైతులు డిమాండ్ చేశారనీ.ఈ సంవత్సరం నీటి కొరత ఉన్నందున అధిక సంఖ్యలో జొన్న పంటలు రైతులు వేశారని వాటికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేపట్టాలని రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సన్న రకం ఏ గ్రేడ్ ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, పాలకవర్గ సభ్యులు గంగారం, సప్పెట్టి నారాయణ, అంజయ్య, సంఘ సీఈవో కోటగిరి సాయిలు, బాబు సెట్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love