అధికారుల పాలనలో గ్రామాల్లో అపరిశుభ్రత..

– పంచాయతీ పాలకవర్గాలు లేక ఇబ్బందులు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలో మొత్తం 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి వీటి పరిధిలో అధికారుల పాలన కొనసాగుతుంది. అధికారుల పాలనలో గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోతున్నప్పటికీ అధికారుల పనితీరు పట్టింపు లేక పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడం ఉమ్మడి మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్పంచుల పదవీకాలం ముగిసి నాలుగు నెలలు గడిచిపోయింది. సర్పంచుల పదవీకాలం ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తూ వస్తుంది. అధికారుల పాలన కొనసాగుతుండగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు రెండు మాసాలు గ్రామ ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీ అధికారులు ఎన్నికల బిజీలోనే కొనసాగారు. అయినప్పటికీ గ్రామాల శుభ్రత పట్ల అధికారుల పాలన నిర్లక్ష్య వైఖరి కొనసాగడం పట్ల అపరిశుభ్రత గ్రామాల్లో పెరిగిపోతుంది. దీనికి నిదర్శనం మండల కేంద్రంలోని మద్నూర్ నడి ఒడ్డున హనుమాన్ మందిర సమీపంలో రోడ్డు పై నుండి మురికి నీరు పారుతూ వస్తున్నాయి. మురికి నీటి నుండే ప్రజలు రాకపోకలు జరుపుతున్నారు. ఆలయానికి వచ్చే పూజారుల భక్తులు కూడా ఆ మురికి నీటి నుండి వెళ్లవలసిన దుస్థితి కొనసాగడం గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోతుంది అనడానికి మండల కేంద్రంలోని నడి ఒడ్డున పారుతున్న మురికి నీరే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకపక్క గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోతుంటే మరోపక్క పారిశుద్ధ్య కార్మికులకు 6, 7 మాసాలుగా జీతాలు చెల్లించకపోవడం, పారిశుద్ధ కార్మికులు జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు.
ఊర్లు బాగుచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు అందక జీతాల కోసం గ్రామపంచాయతీ అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఏది ఏమైనా అధికారుల పాలనలో గ్రామపంచాయతీలు శుభ్రత లేకుండా పోతున్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం అవుతుంది. అపరిశుభ్రత పెరిగిపోవడం గ్రామాల్లో కంపు కొడుతున్నాయి. ఇటీవల మద్నూర్ మండల కేంద్రంలో జిల్లా పంచాయతీ అధికారి డివిజనల్ పంచాయతీ అధికారి గ్రామపంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అపరిశుభ్రత లేకుండా త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆదేశాలు ఇచ్చినప్పటికీ గ్రామాల్లో అపరిశుభ్రత నివారించడంలో ప్రత్యేక అధికారుల పాలన ఏ మాత్రం చొరవ చూపడం లేదని, ఆరోపణలు గ్రామాల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో కొనసాగుతున్న అపరిశుభ్రత పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను దూరం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి మండల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Spread the love