నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు మధు శేఖర్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా బుధవారం పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ,ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ప్రతినిధులు ప్రశాంత్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రసాద్ గౌడ్, పృథ్వీరాజ్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.