పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన

టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లురవి
నవ తెలంగాణ- అచ్చంపేట
రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతు ప్ర జలను చైతన్యం చేయడానికి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో అపూర్వ స్పందన వస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి వంద సీట్లు కచ్చితంగా గెలుస్తున్నామని టీపీసీసీి ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రంగాపూర్‌లో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.. కాం గ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏడాదికి రెండులక్షల ఉద్యోగాలు, నిరుద్యోగబృతి రూ. 4 వేలు కేవలం రూ. 5 వేలకే వంటగ్యాస్‌ సౌకర్యం కల్పించడం జరుగుతుం దని గుర్తుచేశారు. ప్రభుత్వ విధానంతో బాధపడుతున్న బాధితులు ఏకమై తున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు సేవకులుగా ఉండాలని, కానీ కేసీఆర్‌ ప్రభు త్వం హయాంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ పెత్తందారీగా, ఎంపీలు పార్లమెంటు ని యోజకవర్గంలో పెత్తం దారులుగా వ్యవహరిస్తున్నారన్నారు. పెత్తందారుల పాల నకు ప్రజలు తిరస్కరిస్తు న్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ మాట్లాడుతూ.. వెల్ఫేర్‌ సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యంచేస్తుందన్నారు. అడవిలో నివాసముంటున్న చెంచులకోసం ఏర్పా టుచేసిన ఐటీడీఏ, లంబాడా గిరిజన జాతి కోసం ఏర్పాటుచేసిన మాడా వెల్ఫే ర్‌, గిరిజన కార్పొరేషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, మైనార్టీ కార్పొ రేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌లను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. పేదలకు ఇందిర మ్మ ఇల్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. అచ్చం పేట అచ్చంపేటలో ఎన్నికల వేడి ప్రారంభమైం దని రైతులను ఈ ప్రాంత ప్రజల ను మోసం చేయడానికి ఉమామహేశ్వర, చెన్న కేశవ సాగునీటి ప్రాజెక్టులు అం టూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మోసం చేస్తున్నా రని ఆరోపించారు. ఈ సమా వేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి విజయకుమార్‌, నాయకులు మధుసూదన్‌ రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరసయ్యయాదవ్‌, అమ్రాబాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Spread the love