అకాల వర్షం..నేలకొరిగిన అరటి తోటలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట 
మండలంలో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం సంబంధించింది.మధ్యాహ్నం అర్ధ గంటకు పైగా గాలులు తో కూడిన భారీ వర్షం పడింది.దీంతా వేడి తగ్గి వాతావరణం చల్లబడింది. గుర్రాల చెరువు లో ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. 70  పైగా ఎకరాలలో అరటి తోటలు ధ్వంసం అయింది. వర్షం కారణంగా మండలం లోని గుర్రాల చెరువు గ్రామంలో సుమారు 70 ఎకరాలలో అరటి తోట ధ్వంసం అయింది. చక్రాల చిట్టిబాబు, ఏరా లక్ష్మణరావు, కట్టా నాగయ్య, కలపాల రామకృష్ణ, కు చెందిన అరటి తోటలు నేలమట్టమయ్యాయి. నెల రోజుల్లో కోతకు సిద్ధం కాగా మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మబ్బులు కమ్ముకొని ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.అరటి తోటలకు ఎకరాకు లక్ష రూపాయలు మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. మామిడి రైతులు రోదన వర్ణణాతీతం గా ఉంది. చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా తమకు దక్కకుండా పోయిందని మామిడి రైతులు కంటతడి పెడుతున్నారు. జమ్మి గూడెం, గుర్రాల చెరువు, అశ్వారావుపేట, అచ్యుతాపురం గ్రామాలలో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Spread the love