నిరుపేద అమ్మాయి పెండ్లికి అండగా ఉప్పల ఫౌండేషన్‌

నవతెలంగాణ- నాగోలు
ఉప్పల ఫౌండేషన్‌ తండ్రి లేని పేదింటి అమ్మాయి పెండ్లికి అండగా నిలిచింది. హైదరాబాద్‌లోని బండ్లగూడ, జైపూర్‌కాలనీకి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన హేమలత వివాహం కోసం ఆమె కుటుంబ సభ్యులు సహాయం కోసం ఆదివారం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని నాగోల్‌ డివిజన్‌లో ఉన్న ఉప్పల శ్రీనివాస్‌ గుప్త క్యాంప్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త పుస్తె, మెట్టెలు, చీర, గాజులను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పెండ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు, ఎన్‌. సాల్వా చారి, కే. సంతోష్‌ కుమార్‌, వి. ప్రవీణ్‌ కుమార్‌, ప్రశాంత్‌, పాష, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

Spread the love