యాప్‌లో చేసుకోలేనివారికి సులువైన మార్గం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం యూరియా బుకింగ్ సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్ సహాయంతో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు.
మీసేవా ద్వారా ఇలా…
రైతు తన పట్టాదారు పాస్‌బుక్ నంబర్తో సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి.
మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం మరియు పంట వివరాలను నమోదు చేస్తారు.
రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు.
రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ధ్రువీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడీ వస్తుంది.
మీ సేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడి బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు చెల్లుబాటు అవుతుంది.
బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి.
సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలి.
రైతులు తమ పట్టాదారు పాస్ బుక్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి.
కేవలం పదిరూపాయల నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
సందేహాలను తీర్చుకునేందుకు, సహాయం కోసం సమీప వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారి(ఎమ్‌ఏఓ)లను సంప్రదించాలి.
అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ 18001237157
కె. సురేంద్ర మోహన్ ఐఏఎస్. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
స్మార్ట్ ఫోన్ లేని రైతులు, స్వయంగా బుక్ చేసుకోలేని రైతులు మీ సేవా ద్వారా కూడా యూరియా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా యూరియా బుకింగ్ మరింత సులభతరం అవుతుంది. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. బుకింగ్‌లో అభ్యంతరాలుంటే నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18001237157ను అందుబాటులో ఉంచాం.
మీసేవా కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



