అదానీ కొలంబో ప్రాజెక్టుకు అమెరికా నిధులు

–  డీఎఫ్‌సీ నుంచి రూ.4600 కోట్లు
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు శ్రీలంకలో చేపడుతున్న పోర్ట్‌ ప్రాజెక్టుకు అమెరికన్‌ సంస్థ భారీగా నిధులు అందించనుంది. కొలంబోలోని అదానీ సంస్థ అభివృద్థి చేస్తోన్న నౌకాశ్రయానికి 533 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4600 కోట్లు) రుణం ఇవ్వడానికి ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీ) ముందుకు వచ్చింది. శ్రీలంకకు చెందిన జాన్‌ కీల్స్‌ హోల్డింగ్స్‌, శ్రీలంక పోర్ట్స్‌ అథారిటీ కలిసి ‘కొలంబో వెస్ట్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌, అదానీ పోర్ట్స్‌ కన్సారియంగా ఏర్పాడి ఈ పోర్ట్‌ను అభివృద్థి చేస్తున్నాయి. అదానీ గ్రూప్‌ చేపట్టిన ఓ ప్రాజెక్టుకు అమెరికా నిధులు రావడం ఇదే తొలిసారి.

Spread the love