నాణ్యమైన ఉత్పత్తులు వాడండి…అధిక దిగుబడి సాధించండి

– నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మెన్‌ డా. వేణుగోపాలచారి
నవతెలంగాణ – హైదరాబాద్‌ బ్యూరో
నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు వాడి అధిక దిగుబడి సాధించాలని రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మెన్‌ డా. సముద్రాల వేణుగోపాల చారి రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ జరిగిన హార్మోనీ ఎకోటెక్‌ కంపెనీ ఆగ్రీ ఇన్పుట్స్‌ ప్రీ లాంచింగ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంలో నాణ్యమైన కొత్త ఉత్పత్తులు ఉపయోగించి రైతులు అధిక లాభాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్స్‌ నరసింహారావు తోలేటి, పెన్మత్స విజయవరసింహరాజు, ఐవీఎం స్వరూప్‌, పెన్మత్స హర్షవర్ధన్‌, నడింపల్లి శ్రీను,పెన్మెత్స శేఖర్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీకి సంబంధించిన కొత్త, కొత్త ఉత్పత్తులను ఆయన ప్రారంభించారు. గత పదేళ్లుగా హార్మొనీ ఇకో టెక్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఫిరోమొన్‌ లూర్లు, ఇన్సెక్ట్‌ ట్రాపులు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నదని తెలిపారు. ఈ సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆపరేషన్స్‌ మొదలు పెట్టినట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. రైతుకు అవసరమైన అన్ని రకాల అగ్రి ఇన్పుట్స్‌ – మైక్రో న్యూట్రియెన్ట్స్‌, నీటిలో కరిగే ఎరువులు, బయోఫర్టిలై జర్లు, బయో పెస్టిసైడ్లు, బయో స్టిములెంట్లు, గ్రోత్‌ ప్రమోటర్లు, హెర్బిసైడ్లు, ఫంగిసైడ్లు, ఇన్సెక్టి సైడ్లు లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కంపెనీలు మార్కెట్‌ లో వందలకొద్దీ ఉన్నప్పటికీ, ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌, నాన్‌ కెమికల్‌, కెమికల్‌ ఇన్‌ పుట్స్‌ అన్నింటినీ ఒకే చోట రైతుకి ఒకే కంపెనీ అందుబాటులోకి తీసుకురావడమనేది చాలాఅరుదుగా ఉందన్నారు.. దీనివల్ల రైతుకు, డీలర్లకు కూడా చాలా సౌలభ్యంగా వుంటుందని తెలిపారు. వాటిని తయారుచేయడానికి, పరీక్షించడానికి శాస్త్రవేత్తలు, లాబొరేటరీ కూడా ఉన్నట్టు తెలిపారు. ఉత్పత్తులను పరీక్షించేం దుకు పీహెచ్డీ, పీజీ చేసిన ప్రతిభావంతులతో ఐదెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆర్‌ అండ్‌ డీ డెమో ఫార్మ్‌ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో డీలర్లు., కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love