నేటి నుంచి మూగజీవాలకు గాలి కుంటూ టీకాలు

నవ తెలంగాణ-తాడ్వాయి
జిల్లాలో నేటినుంచి నెల రోజుల వరకు జరిగే గాలికుంటు టీకాల కార్యక్రంలో భాగంగా సోమవారం రోజున తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ పులగం సాయి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య క్రమం లో AMC చైర్మన్ పుల్గం సాయిరెడ్డి , ఉప సర్పంచ్ మర్రి సాయిరెడ్డి, డైరీ చైర్మన్ కిష్టారెడ్డి, డా.రాంచందర్, సిబ్బంది మరియు పాడి రైతులు పాల్గొన్నారు, సీజన్ లో వచ్చే వైరస్ వ్యాధి(FMD )నుండి కాపాడు కోవడానికి 3 నెలలు పైబడిన దుడలకి, చూలు కట్టిన , పాలు ఇచ్చే అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలి అని మండల పశు వైద్య అధికారి డా.రాంచందర్ చెప్పడం జరిగినది.97 ఆవులకి, 64 గేదెలకు టీకాలు వేసామని తెలిపారు.
Spread the love