
– జుక్కల్ కాంగ్రెస్ టికెట్ ఈసారి మాదిగ లకే ఇవ్వాలి విద్యావంతురాలు విద్య
నవతెలంగాణ- మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామానికి చెందిన విద్యావంతురాలు గైక్వాడ్ విద్య కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు మాదిగలకే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. పెద్ద టాక్లీ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకోవడం పెద్ద టాక్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో జుక్కల్ నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశించే వారి సంఖ్య నాలుగు కు చేరింది టికెట్ల సంఖ్య పెరగడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం జుక్కల్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.