
మండల పరిధిలోని జమ్మిగూడెం లో బ్యాంక్ ఖాతాదారులకు,పలు పథకాలు లబ్ధిదారులకు విడ్స్ ఎన్జీవో ఆద్వర్యంలో బుధవారం ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ వి అంజిబాబు, డి.చంటి లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజన ఇన్సూరెన్స్ లు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ బ్యాంకుల్లో ఋణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి సివిల్ స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. అదేవిధంగా ఆర్థిక సైబర్ నేరగాళ్లు పట్ల జాగ్రత్త వహించాలని, ఫోన్ ద్వారా ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఎవరికి తెలియజేయకూడదని, ఫోన్ లోకి వచ్చే లింక్స్ తెలియకుండా ఓపెన్ చేయకూడదని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెన్నాడ సూర్య కళ, మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య, వార్డ్ మెంబర్స్, కార్యదర్శి స్పందన, డ్వాక్రా మహిళలు, పంచాయితి సిబ్బంది, గ్రామ యువకులు పలువురు పాల్గొన్నారు.