భారీ మొసలిని చంపుకుని తిన్న గ్రామస్తులు..

నవతెలంగాణ – ఆస్ర్టేలియా : మూడున్నర మీటర్లున్న ఓ భారీ మొసలిని గ్రామస్తులు చంపుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో గతేడాది వచ్చిన వరదలకు చాలా గ్రామాలు నీట మునిగాయి. ఎక్కడెక్కడి నుంచో జలచరాలు కొత్త ప్రదేశాలకు చేరాయి. ఆ సమయంలోనే మూడున్నర మీటర్ల పొడువున్న ఓ భారీ మొసలి నార్తరన్ ఆస్ట్రేలియాలోని ఓ నదిలోకి చేరింది. ఆ నదికి పావు కిలోమీటరు దూరంలోనే ఓ చిన్న గ్రామం ఉంది. ఈ మొసలి నీటిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ వీధి శునకాలను చంపి తింటోంది. ఇది గమనించిన గ్రామస్థులు మొసలి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అంత భారీ మొసలిని భద్రంగా జూ కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో భారీ మొసలిని పోలీసులతో కలిసి గ్రామస్థులు మట్టుబెట్టారు. కొట్టి చంపేసి, ఆపై కోసుకుని తినేశారు. చంపకుండా వదిలివేస్తే గ్రామస్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందనే ఉద్దేశంతోనే చంపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

 

Spread the love