శాశ్వత పరిష్కారం కోసం అధికారులను కలిసిన చేపూర్ గ్రామస్తులు

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ యువకులు నాయకులు శుక్రవారం  ఆర్డిఓ   ఏసీపీని కలిసి గ్రామ స్మశాన వాటిక రోడ్డు సమస్య గురించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. చేపూర్ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్   135/2  37 గుంటలు, సర్వే నంబర్ 135/3 31 గుంటలు, సర్వే నంబర్ 135/4 1.23 ఎకరాలు మొత్తం భూమిని గత 25 సంవత్సరాల క్రితం చేపూర్ గ్రామానికి చెందిన తండ్రి కొడుకు సారంగి పెద్ద సాందన్న. విజయ్ లు అప్పటి రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై  ఈ భూమి కోర్టు స్మశాన వాటిక  జంబి భూమి అని తీర్పు ఇచ్చిన కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని గ్రామానికి స్మశాన వాటిక దసరా రోజు నిర్వహించే జంబిపూజ స్థలాలు లేకుండా చేసారు. ఈ భూమి గ్రామానికి చెందినది అని అడిగితే గ్రామ అభివృద్ధి కమిటీ పైన  ఐదు అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు . పెట్టించాడు అదేవిధంగా గ్రామంలో గత పూర్వం నుండి జమ్మి పూజకు. గ్రామ దేవతల గుడులకు ( పోచమ్మలగుడులకు) వెళ్లే దారిని మూసివేసి అక్రమ పంట వేస్తున్నాడు. గ్రామంలో ఇది అన్యాయమని ఎవరు అడిగినా  వారిని బెదిరిస్తూ వారి పై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని గ్రామస్తులు వాపోయారు.
ఈ సమస్య  పై అధికారుల వద్దకు  నాయకుల వద్దకు గత 20 సంవత్సరాల నుండి చెప్పులు అరిగేదాకా తిరిగిన  కూడా ఎవ్వరు ఈ సమస్యకు పరిష్కరిస్తా లేరని   అతను ఎస్సి కులానికి చెందిన వాడు అని అతని వైపే అధికారులు అందరూ ముగ్గు చూపుతున్నారని  గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులే 90% పేద కులస్తులే ఉన్నారని వారు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కొరకు  గ్రామ అభివృద్ధి కమిటీ. గ్రామ ప్రజలు 25 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నామని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , జంబిపూజ స్థలం కొరకు  స్మశాన వాటిక. నిరుపేద ప్రజలు ఇంటింటికి డబ్బులు పోగు చేసుకుని గత 20 సంవత్సరాల నుండి సుమారు 30 లక్షల వరకు ఖర్చు చేసుకున్నారు. దీనికి ప్రజా ప్రతినిధులు  రాజకీయ నాయకులు  అధికారులు  సమస్యను పరిష్కరించడం లేదని వారు అన్నారు , గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం కెనాల్ స్థలంలో వైకుంఠధామం గత ప్రభుత్వం నిర్మించింది. అదే ప్రదేశంలో బోరు మోటర్ ప్రభుత్వం వేసిన కూడా దానిని సారంగి విజయ్ ధ్వంసం చేసి బోరు రంధ్రాన్ని మూసేసాడు ఇంత జరిగినా గ్రామస్తులకు న్యాయం దొరకడం లేదని అంటున్నారు. ఈ రోడ్డు పై నుండి కూడా గత పది సంవత్సరాల క్రితం మెటల్ రోడ్డు ప్రభుత్వం చేపూర్ నుండి లక్కోరా వరకు పోయించిన. రోడ్డును కూడా సారాంగి విజయ్  ధ్వంసం చేసిసడని. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభుత్వ జంబిపూజ భూమిని, స్మశాన వాటిక భూమీనీ జిల్లా కలెక్టర్  విచారణ చేసి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని గ్రామ ప్రజలు కోరారు  ప్రభుత్వ అధికారులు.  ప్రజాప్రతినిధులు  సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఈ కార్యక్రమం లో. మాజీ సర్పంచ్ ఇందూర్ సాయన్న. మాజీ ఎంపీటీసీ జన్నేపల్లి గంగాధర్. వీడీసీ అధ్యక్షుడు మేడిపల్లి  శ్రీకాంత్. కోశాధికారి రుక్మాజి  గ్రామస్తులు సారంగి శాంతి కుమార్. సింధుకార్ చరణ్. దాసరి నాగరాజు. దాసరి శ్రీకాంత్. నర్సారెడ్డి .డి సాయన్న. తదితరులు పాల్గొన్నారు.

Spread the love