విశ్వరూప సభ చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

నవ తెలంగాణ- మల్హర్ రావు: ఎస్సి రిజర్వేషన్ కు చట్టభద్ధత కల్పించాలని ఈ నెల 11న హైదరాబాద్ లో ఉప కులాల విశ్వరూప సభను జయప్రదం చేయాలంటూ శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో భూపాలపల్లి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మాచర్ల వంశీ కృష్ణ, మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కేశారపు నరేశ్ ఆధ్వర్యంలో విశ్వరూప సభ చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ నవంబర్ 11 వ తారీకున హైదరాబాదు నగరంలోని పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉపకులాల విశ్వరూప సభను జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణ మాదిగకు తోడుగా విశ్వరూప మహాసభకు వికలాంగులు వృద్ధులు వితంతువులు సామూహిక పెన్షన్లు పొందుతున్న ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పొలాలను జనాభా ప్రతిపాదక ఎస్సీ లలోని అన్ని కులాలకు పంచాలన్నదే ఎమ్మార్పీఎఫ్ లక్ష్యం అందుకు ఎస్సీ వర్గీకరణ ద్వారానే తప్ప మాదిగ ఉపకులాలకు ప్రజలు విద్యా ఉద్యోగము సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అభివృద్ధిలోకి రావడానికి వేరే మార్గం లేదన్నారు. సమాజంలో ఆర్థికంగా నిలబెట్టడమే లక్ష్యంగా వారికోసం 2007 ఆగస్టు 28న విహెచ్పిఎస్ ని స్థాపించి కేవలం రూ.200 ఉన్న పెన్షన్ ని రూమ్1500 పెంచాలని డిమాండ్ చేస్తూ మూడు నెలల్లో 147 సభలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి నవంబర్ 26న లక్షలాదిమంది వికలాంగులను ఎమ్మార్పీ సాయంతో సమీకరించి వికలాంగుల గర్జన పేరుతో నిజాం కాలేజీ గ్రౌండ్లో ప్రపంచమే ఉలిక్కిపడే విధంగా వికలాంగుల మహా గర్జన చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల పోరాట సమితి మండల అధ్యక్షుడు కనవేన లక్ష్మన్ తోపాటు ఆయా గ్రామాల వికలాంగులు పాల్గొన్నారు.
Spread the love