వాక్ ఫర్ ఇన్నోవేషన్ – ఇంటింటా ఇన్నోవేటర్ 2024

Walk for Innovation - Innovator at Home 2024నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం నిర్వహించిన ‘వాక్ ఫర్ ఇన్నోవేషన్’ కార్యక్రమం కామారెడ్డి జిల్లా లో అందరి దృష్టిని ఆకర్షించింద జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ప్రధాన కార్యక్రమం అయిన ‘ఇంటింటా ఇన్నోవేటర్ 2024’ ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా లో నిర్వహించిన ‘వాక్ ఫర్ ఇన్నోవేషన్’ కార్యక్రమన్ని నిజాం సాగర్ చౌరస్తా నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వరకు జరిగిన ర్యాలీని   జెండ్డ ఊపి ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామీణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆవిష్కర్తను ఇంటింటా ఇన్నోవేటర్ కు దరఖాస్తు చేసుకోవలసిందిగా  కోరారు  . తమ అద్భుతమైన ఆలోచనలతో, స్థానిక సమస్యలకు ఆవిష్కరణలు తయారు చేసి ఆ సమస్యకు అడ్డుకట్ట వేసిన ప్రతి ఒక్క ఆవిష్కర్తను దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నాము అని పేర్కొన్నారు. సవాళ్లను పరిష్కరించే అత్యంత ఆశాజనకమైన పరిష్కారాలు ఆగస్టు 15, 2024న అవార్డులతో గుర్తించబడతాయనీ,  ఈ సంవత్సరం మరిన్ని ఔత్సాహిక ఆవిష్కర్తలకు సమగ్ర మద్దతు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సిద్ధంగా ఉంది అన్నారు. జిల్లాలోని ప్రజలకు ఆవిష్కరణ సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు చేసిన ఈ కార్యక్రమం నూతన ఆవిష్కరణల సంస్కృతి గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, గ్రామీణ ఆవిష్కర్తలు  ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
‘వాక్ ఫర్ ఇన్నోవేషన్’ చొరవ గ్రామీణ స్థాయిలో ఆవిష్కరణల స్ఫూర్తిని రేకెత్తించడంతో పాటు, తెలివైన ఆలోచనలతో ప్రతిభావంతులను గుర్తించడం కూడా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం యొక్క జిల్లా ఇన్నోవేషన్ కోఆర్డినేటర్లు సంబంధిత జిల్లాలలో  కామారెడ్డి జిల్లా  నిర్దేశించిన ప్రాంతాలు,మార్గాల ద్వారా ఇంటరాక్టివ్ వాక్లతో ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న స్థానిక సవాళ్లను పరిష్కరించే ఆలోచనలు ప్రజలలో రేకెత్తించేందుకు, వారికి ఆవిష్కరణ సంస్కృతిని పరిచయం చేసేందుకు నిర్వహించిన ఈ వాక్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో మునిపటి సంవత్సరం వెలికి తీసిన ఆవిష్కర్తలు పాల్గొని, తమ జిల్లాలోని ప్రజలకు ఆవిష్కరణ గురించి వివరించారు. స్థానిక జీవనోపాధి సవాళ్ల గురించి చర్చల్లో ప్రజలను నిమగ్నం చేయడం ద్వారా సృజనాత్మక పరిష్కారాలను ప్రారంభించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. చివరికి ఈ జిల్లాలను ఆవిష్కరణ కేంద్రాలుగా మారుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ఈ ఏడాది ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం యొక్క 6వ ఎడిషన్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోందనీ,  10 ఆగస్టు, 2024లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా సమస్య పరిష్కార ఆలోచనలు ఉన్న ఆవిష్కర్తలందరినీ ప్రోత్సహిస్తున్నాము అన్నారు. షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులు తమ ఆలోచనలను ఆగస్టు 15, 2024న ప్రదర్శించడానికి ఆహ్వానించబడతారు. అత్యంత ఆకర్షణీయమైన ఆవిష్కరణలకు గుర్తింపుతో పాటు మద్దతు కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీవో రంగనాథ్ , డిపిఓ శ్రీనివాస్ రావు , విద్యా శాఖ అధికారి రాజు , ఎం.ఆర్.ఓ. జనార్దన్, మున్సిపల్ కమిషనర్ సుజాత ,  డి డబ్ల్యూ ఓ భవయ్య , డీఎస్ఓ. సిద్ది రాంరెడ్డి , ఈడీఎం. ప్రవీణ్ , టి ఎస్ ఐ సి. డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ గగన్, గవర్నమెంట్ డిగ్రీ, ఆర్ కే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఎన్. సి. సి విద్యార్థులు,వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love