
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ మత్స్యశాఖ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోని జంగిడిపల్లికి చెందిన భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ను నియామకం రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అభ్యరుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని,మత్స్యకారుల పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందన్నారు.తనకు అప్పజెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని జంగిడి శ్రీనివాస్ అన్నారు.