అంగన్వాడి సెంటర్ల పైన ప్రభుత్వ ధమనకాండ ను ఖండిస్తున్నాం

– పెద్ది వెంకట్రాములు 

నవతెలంగాణ కంటేశ్వర్
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మెకు దిగిన విషయం విధితమే. గత సంవత్సరం కాలంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ అనేక ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరిగా వారం పది రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా కనీసం ఆలోచన కూడా ఈ పాలకులకు చేయలేదు. మోపాల్ మండల కేంద్రంలో జరిగిన సమ్మె కార్యక్రమంలో మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్. విగ్నేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ క్రమంలో అంగన్వాడి టీచర్లకు ఒక ఆశ్చర్య కరమైన వార్త వచ్చింది. ప్రభుత్వమే గ్రామ కార్యదర్శి, గ్రామ అధికార యంత్రంతో కలిసి అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలగొట్టి, అక్రమంగా లోపటికి వివోఏలని ప్రవేశింపజేసి, ఆ సెంటర్లు నడిపే కుట్ర చేసిండ్రు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు అన్నారు. అంగన్వాడీ టీచర్లు సమ్మె లో ప్రస్తావించిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ దశాబ్దాల కిందనే ఒక కుటుంబం జీవించాలి అంటే నెలకు కనీసం 18 వేల రూపాయలు అవసరం అని నిర్ధారించారు. ప్రస్తుతం 18,000 సరిపోవు.. కనీసం 25 వేల అయితేనే కుటుంబం నడుస్తుంది. మరి వీళ్ళకిస్తున్నది సుమారు 13వేలు. అది కూడా సక్రమంగా ఇవ్వటం లేదు. అనేక రకాల ఆంక్షలు పెడతున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. పని భారం పెంచారు కానీ వాళ్ళ ఉద్యోగాలను, వారి పనిని పర్మనెంట్ చేయటం లేదు. కనీస వేతనం అమలు చేయడం లేదు. ఆయమ్మల పరిస్థితి సరేసరి. అయినా వాళ్ళు కరోనాలాంటి సమయంలో ఫ్రంట్ అండ్ వారియర్స్ గా పనిచేసి తమ సత్తాని, మానవత్వాన్ని చాటారు. అయినా ఈ పాలకులకు కనికరం లేదు. ఇప్పుడు అలాంటి అంగన్వాడీ టీచర్ల సెంటర్ల పైన దాడి చేసి తాళాలు పగలగొట్టి లోపటికి వెళ్లడం అంటే.. వారు లేనప్పుడు వారి విధి ఆధీనంలో ఉన్న సెంటర్ ని తాళాలు పగలగొట్టి ప్రవేశించడం అంటే చట్టరీత్యా ముమ్మాటికీ నేరం. అందులో ఉన్న ఫుడ్ సెషన్ కి సంబంధించిన వస్తువులు దొంగిలించబడలేదు అని నమ్మకం ఏముంది అని వెంకట్రాములు ఆవేదనను వ్యక్తం చేసారు. అందుకని తాసిల్దార్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి మోపాల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు కార్యదర్శులు ఎవరెవరు దగ్గరుండి ఉండి తాళాలు పగలగొట్టారో వారందరినీ అరెస్టు చేయాలని, దొంగతనం నేరం కూడా పెట్టాలని, పోలీస్ కి ఫిర్యాదు చేసారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె కొనసాగుతుందని, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, సమ్మె నడుస్తుంది అని హెచ్చరించారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఒకవేళ అందులో పోయిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని రికవరీ చేసి ప్రభుత్వ ఆస్తులని కాపాడాలని, లేనిచో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ లీడర్లు సులోచన, సురేఖ, రాజ్యలక్ష్మి, స్వప్న, అన్ని సెంటర్ల టీచర్లు ఆయమ్మలు పాల్గొన్నారు.
Spread the love