Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

- Advertisement -

– టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి 

ఇంద్రనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇంద్రనగర్ 20వ వార్డు కాలనీలో గురువారం నిర్వహించిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు తూపత్రి రాజు–నిర్మల దంపతులు, మొహమ్మద్ సుమేర్–ఆసియా కుటుంబాల కొత్త ఇళ్లలో గృహప్రవేశ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అవసరమైన డిన్నర్ సెట్ సామగ్రిని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తోందన్నారు. సొంత స్థలం లేని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున త్వరలో కీలక ప్రకటన వెలువడనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మహమ్మద్ సలీం, జమీల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిళ్ల అంజయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, క్రెడా అధ్యక్షులు నర్సా గౌడ్, రంగ రమేష్ గౌడ్, పిడుగు సాయిబాబా, సునీల్ గౌడ్, మెహర్ బాబా గౌడ్, బల్ల శ్రీనివాస్, కోటి, ఆబిద్, మున్ను, శశి, ఆకాష్, హైమద్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -