పదల గుడిసెలకు అండగా ఉంటాం

– కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గద్దల రమేష్‌
పాల్వంచ : పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని, వెంగళరావు కాలనీలో 727 సర్వే నంబర్‌ ప్రభుత్వ భూమిలో కొంత కాలంగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న రేవంత్‌ నగర్‌ ప్రజలకు వానపాకుల రాంబాబు అధ్వర్యంలో పాల్వంచ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గద్దల రమేష్‌ గుడిసె వాసులకు మద్దతు తెలిపి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం గద్దల రమేష్‌ మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వములో ప్రతీ ఒక్కరికీ గృహ నిర్మాణనీకి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలు వేసుకున్న గుడిసెలను ఎవరైనా తొలగించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ యువసేన రమణ, భద్రమ్మ ప్రియమణి, లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ పార్టీ మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love