కంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ వ్యతిరేకులే

నవతెలంగాణ-ఇల్లందు
అడవులలో ఉన్న వనరులను ఖనిజాలను సంపదలను మోడీ మిత్రులైన ఆధాని, అంబానీలకు కట్టబెట్టేందుకు అడవులలో ఉన్న ఆదివాసీలపై యుద్ధాలు చేస్తున్నాయని ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి.రాసుద్దీన్‌, పార్టీ మండల కార్యదర్శి మోకాళ్ల రమేష్లు అన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కార్యాలయంలో సోమవారం 32 ఏళ్ల క్రితం రాజ్యం హత్యకాండకు బలైన నంబూరి సీతారామారావు, నోములపరశురాములు, కోటన్న, చింత లక్ష్మి, సుశేనలకు విప్లవ జోహార్లు అర్పించారు. అమరుల చిత్ర పటానికి ముందుగా పూల మాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాంసింగ్‌ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిరామ్‌ సింగ్‌, మోకాల రమేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, బిఎన్‌ కాంతారావు, ఏ.మహేందర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Spread the love