మీలో ఒకరిలా సేవలు అందిస్తా…

విధుల్లో చేరిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
విధుల్లో చేరిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
– విధుల్లో చేరిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట లోనే, అందరికీ అందుబాటులో ఉంటూ మీలో ఒకరి లా మెలుగుతూ పౌర సేవలు అందిస్తానని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం అశ్వారావుపేట లో విధుల్లో చేరిన అనంతరం జెండా వందనం లో పాల్గొన్నారు. పోలీస్ లాంఛనాలు తో జాతీయ పతాకం ఎగురవేసిన తర్వాత మాట్లాడారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇక్కడ కు బదిలీ అయినందు అందరి సహకారంతో సుహృద్భావ వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేద్దాం అని అన్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్ళి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్ఛం అందజేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Spread the love