ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ శత జయంతి

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీ య నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం వరంగల్‌ పశ్చిమని యోజకవర్గ కో-ఆర్డినేటర్‌ ఎండి. రహీమ్‌ ఆధ్వర్యంలోలి రాష్ట్ర పార్టీ కార్యదర్శి బా బాఖాదర్‌ అలీ అందుబాటులో ఉన్న నాయకులతో కలిసి హన్మకొండ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ చౌర స్తాలో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ స్థాపించి 9నెలలకాలంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పెద్దఎత్తున ప్రజలకు అనేకసంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగు దేశం పార్టీ ఎన్టీ రామారావు సూచించిన దానికి అనుగుణంగానే ఈనాడు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బడుగు, బలహీన వర్గాల కోసం, యువత కోసం అనేకరకాల సంక్షేమ పథకాలను తెచ్చి అభివద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందని, వారి ఆయన ఆశయాలకు అనుగణంగా ప్రతీ టీడీపీ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి బాబా ఖాదర్‌ అలీ, నాయకులు బైరపాక ప్రభాకర్‌, చిలువేరు మహేష్‌, వల్లేపు శ్రీనివాస్‌, కటకం కుమారస్వామి, అనిశెట్టి సతీష్‌, మాడగానిమనోహర్‌, కొంగర ప్రభాకర్‌, మహేం దర్‌, శివరాత్రి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Spread the love