నిరంతరం సంక్షేమం.. మూడు వందలు మంది వృత్తిదారులు లబ్ధి

– ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
సంక్షేమ పథకాలు అమలు నిరంతరం ఉంటుందని,మొదటి విడత రాని వాళ్ళు నిరాశ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నూతనంగా అమలు చేస్తున్న వెనుకబడిన కులాల చేతి వృత్తి దారులకు రూ.లక్ష ఋణం అందజేసే కార్యక్రమాన్ని సోమవారం అశ్వారావుపేట లోని గిరిజన భవన్ లో నియోజక వర్గం మండలాల లబ్ధిదారులకు అందజేసారు. బి.సి సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి ఇనపనూరి  ఇందిర అద్యక్షతన జరిగిన చెక్కులు పంపిణీ కి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలన చేసినప్పటికి సీఎం కేసీఆర్ అంత ప్రజారంజకంగా ఎవరూ పాలన చేయలేదని అన్నారు.ప్రతీ కుటుంబంలో ఏదో ఒక పథకం వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందిస్తుంది అని మార్పు వ్యక్తం చేసారు. అనంతరం బీసీ సంక్షేమ జిల్లా అధికారిని ఇందిర మాట్లాడుతు రూ.లక్ష పథకానికి ఎంపికైన ప్రతీ లబ్ధిదారుల వృత్తి సామాగ్రి కొనుగోలు చేసుకుని ఆర్ధికంగా సాధికారత సాధించాలని అన్నారు. పరిశ్రమల జిల్లా జనరల్ మేనేజర్,దళిత బంధు నియోజక వర్గం ప్రత్యేక అధికారి సీతారాం నాయక్ మాట్లాడుతూ సూక్ష్మ ఋణాలు తో చేతివృత్తులు అభివృద్ది చేసుకుని ఆర్ధిక పురోభివృద్ధి సాధించినప్పుడు ఏ పథకానికి అయినా సార్ధకత లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండలాల ఎం.పి.డి.ఒ లు,తహశీల్దార్ లు,ఎం.పి.పి,వైఎస్ ఎం.పి.పి లు,జెడ్.పి.టి.సీ లు,అశ్వారావుపేట,పేరాయిగూడెం సర్పంచ్ లు పాల్గొన్నారు.

Spread the love